టీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్ లో బిగ్ ఫైట్
ఫైనల్లో చోటు కోసం ఇంగ్లండ్ తో భారత్ ఢీ సెయింట్ లూషియా వేదికగా భారత్-ఇంగ్లండ్ సెమీస్ కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2018 టీ-20 మహిళా ప్రపంచకప్ లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్… ఫైనల్ బెర్త్ కోసం ఉరకలేస్తోంది. సెయింట్ లూషియా వేదికగా జరుగుతున్న సెమీస్ సమరంలో ఇంగ్లండ్ తో భారత్ డూ ఆర్ డై ఫైట్ కి సిద్ధమయ్యింది. భారత్ టాప్ గేర్…. సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు…గ్రూప్ […]
- ఫైనల్లో చోటు కోసం ఇంగ్లండ్ తో భారత్ ఢీ
- సెయింట్ లూషియా వేదికగా భారత్-ఇంగ్లండ్ సెమీస్
కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2018 టీ-20 మహిళా ప్రపంచకప్ లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్… ఫైనల్ బెర్త్ కోసం ఉరకలేస్తోంది.
సెయింట్ లూషియా వేదికగా జరుగుతున్న సెమీస్ సమరంలో ఇంగ్లండ్ తో భారత్ డూ ఆర్ డై ఫైట్ కి సిద్ధమయ్యింది.
భారత్ టాప్ గేర్….
సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు…గ్రూప్ – బీ లీగ్ లో…నాలుగు కు నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లోనూ నెగ్గడం ద్వారా…మూడోసారి సెమీస్ కు అర్హత సంపాదించింది.
తొలిరౌండ్లో రెండో ర్యాంకర్ న్యూజిలాండ్, రెండోరౌండ్లో పాకిస్థాన్, మూడోరౌండ్లో ఐర్లాండ్, నాలుగో రౌండ్లో టాప్ ర్యాంక్ ఆస్ట్రేలియా జట్లను చిత్తు చేయడం ద్వారా భారత మహిళలు తమ సత్తా చాటుకొన్నారు.
సెమీస్ లో ఇంగ్లండ్ గండం….
గ్రూప్ – బీ లీగ్ టాపర్ గా నిలిచిన భారత్…సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో మాత్రం మాజీ చాంపియన్ ఇంగ్లండ్ నుంచి అసలు పరీక్ష ఎదుర్కోనుంది. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో… ఇంగ్లండ్ చేతిలో కంగుతిన్న భారత్… ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ సెమీస్ లోనే బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.
స్పిన్ బౌలింగే ఆయుధం…
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గిన భారత్…స్పిన్నర్లే విన్నర్లుగా మరో విజయానికి ఉరకలేస్తోంది. లీగ్ దశ మ్యాచ్ ల్లో భారత్ పడగొట్టిన మొత్తం 30 వికెట్లలో… స్పిన్నర్లు సాధించినవే 28 వికెట్లు ఉండటం చూస్తే… భారత ప్రధాన అస్త్రం స్పిన్ బౌలింగే అని చెప్పక తప్పదు.
ఇద్దరూ ఇద్దరే…
పవర్ ఫుల్ న్యూజిలాండ్ తో జరిగిన తొలిరౌండ్ పోటీలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధూమ్ ధామ్ సెంచరీ సాధిస్తే….ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో రౌండ్ పోటీలో… వైస్ కెప్టెన్ స్మృతి మంథానా కీలక హాఫ్ సెంచరీతో సత్తా చాటుకొంది.
యంగ్ గన్ జెమీమా రోడ్రిగేస్, మిడిలార్డర్లో వేద కృష్ణ మూర్తి, రెండు హాఫ్ సెంచరీలతో వెటరన్ మిథాలీ రాజ్.. కళ్లు చెదిరే ఫామ్ లో ఉండడంతో భారత జట్టు సమతూకంతో కనిపిస్తోంది.
రికార్డు బ్యాడ్ బ్యాడ్….
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 13 టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత్ కు…మూడంటే మూడు విజయాలు మాత్రమే ఉన్నాయి. పది పరాజయాలతో ఇంగ్లండ్ కంటే ఎంతో వెనుకబడి ఉంది.
అయితే…రెండుజట్ల ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే…భారతజట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.
రమేశ్ పొవార్ మ్యాజిక్…
ప్రస్తుత ప్రపంచకప్ లో భారత జట్టు హాట్ ఫేవరెట్ గా నిలవడం వెనుక ప్రధాన శిక్షకుడు రమేశ్ పొవార్ పాత్ర ఎంతో ఉందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెబుతోంది.
రమేశ్ రాకతో తమ దృక్పథమే మారిపోయిందని…ఆత్మవిశ్వాసం పెరిగిందని…ప్రత్యర్థి ఎవరన్నది చూడకుండా దూకుడుగా ఆడే తత్వం అలవడిందంటూ ప్రశంసల వర్షం కురిపించింది.
సెయింట్ లూషియా వేదికగా…..
సెయింట్ లూషియాలోని డారెన్ సామీ స్టేడియం వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తో…టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా ఢీ కొంటుంది.
ఈ మ్యాచ్ ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్, భారత్ తలపడతాయి.
భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 5-30 గంటలకు రెండో సెమీస్ సమరం ప్రారంభమవుతుంది.