Telugu Global
NEWS

మెల్బోర్న్ లో....  టీమిండియా " ఆసీస్ రెండో టీ-20 ఫైట్

విరాట్ సేనకు డూ ఆర్ డైగా మారిన మ్యాచ్ తొలి టీ-20 విజయంతో ఆసీస్ 1-0 ఆధిక్యం టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ టీ-20 షో…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియానికి చేరింది. మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న ఈ పోటీ…నాలుగోర్యాంకర్ ఆస్ట్రేలియాకు చెలగాటం…2వ ర్యాంకర్ టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది. బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా ముగిసిన తొలి సమరంలో…ఆతిథ్య ఆస్ట్రేలియా …డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో టీమిండియాను కంగు […]

మెల్బోర్న్ లో....  టీమిండియా  ఆసీస్ రెండో టీ-20 ఫైట్
X
  • విరాట్ సేనకు డూ ఆర్ డైగా మారిన మ్యాచ్
  • తొలి టీ-20 విజయంతో ఆసీస్ 1-0 ఆధిక్యం

టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ టీ-20 షో…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియానికి చేరింది.

మరికొద్ది గంటల్లో ప్రారంభంకానున్న ఈ పోటీ…నాలుగోర్యాంకర్ ఆస్ట్రేలియాకు చెలగాటం…2వ ర్యాంకర్ టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది.

బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా ముగిసిన తొలి సమరంలో…ఆతిథ్య ఆస్ట్రేలియా …డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో టీమిండియాను కంగు తినిపించడం ద్వారా 1-0 ఆధిక్యం సాధించడంతో…ఈ మ్యాచ్ …సిరీస్ కే కీలకంగా మారింది.

టీమిండియాదే పైచేయి….

ప్రస్తుత సిరీస్ తొలి టీ-20 వరకూ… రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ రెండుజట్లూ 16 సార్లు తలపడితే టీమిండియా 10 విజయాలు, ఆస్ట్రేలియా 6 విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఆస్ట్రేలియా గడ్డపైన ఇప్పటి వరకూ ఏడుమ్యాచ్ లు ఆడిన టీమిండియా 4 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో నిలిచింది.

First Published:  22 Nov 2018 9:21 AM IST
Next Story