సాహో హక్కులు 70 కోట్లు.... ఎవరు కొంటారు?
సాహో సినిమాకు సంబంధించి యూవీ క్రియేషన్స్ చెబుతున్న ఎమౌంట్ ఇది. శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ కలిపి 70 కోట్లు కావాలంటోంది యూవీ క్రియేషన్స్. గతంలో కూడా ఇంతే మొత్తం చెప్పారు. మెత్తబడతారేమో అనుకుంటే తాజాగా కూడా అదే ఫిగర్ పై కూర్చున్నారు. దీంతో సాహో బిజినెస్ ఎంతకీ తెగడం లేదు. ఈ సినిమా రైట్స్ కోసం జీ తెలుగు, స్టార్ మా, జెమినీ లాంటి సంస్థలన్నీ పోటపడుతున్నాయి. అందరికీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి…. […]
సాహో సినిమాకు సంబంధించి యూవీ క్రియేషన్స్ చెబుతున్న ఎమౌంట్ ఇది. శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ కలిపి 70 కోట్లు కావాలంటోంది యూవీ క్రియేషన్స్. గతంలో కూడా ఇంతే మొత్తం చెప్పారు. మెత్తబడతారేమో అనుకుంటే తాజాగా కూడా అదే ఫిగర్ పై కూర్చున్నారు. దీంతో సాహో బిజినెస్ ఎంతకీ తెగడం లేదు.
ఈ సినిమా రైట్స్ కోసం జీ తెలుగు, స్టార్ మా, జెమినీ లాంటి సంస్థలన్నీ పోటపడుతున్నాయి. అందరికీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి…. కుదిరితే అన్ని హక్కులు కలిపి గంపగుత్తగా తీసుకోవాలని చూస్తున్నాయి. కానీ యూవీ నిర్మాతలు మాత్రం కొండెక్కి కూర్చున్నారు. దిగేది లేదని మొండికేస్తున్నారు.
ప్రస్తుతానికైతే ఛానెల్స్ అన్నీ 50 దగ్గర ఆగాయి. అటుఇటుగా ఎమౌంట్ ఊగిసలాడుతోంది. అంటే నిర్మాతలకు, ఛానెల్స్ కు మధ్య 20 కోట్ల గ్యాప్ ఉంది. ఇంత మార్జిన్ లో రైట్స్ ఇవ్వడానికి నిర్మాతలకు ఇష్టం లేదు. 50 దాటడానికి ఛానెల్స్ కు ఇష్టంలేదు. ఈ మేటర్ ఎప్పుడు తెగుతుందో చూడాలి.