Telugu Global
NEWS

ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో మేరీ కోమ్

ఆరో ప్రపంచ స్వర్ణానికి భారత స్టార్ బాక్సర్ గురి సెమీస్ లో కిమ్ హ్యాంగ్ పై మేరీ గెలుపు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీల నాలుగు విభాగాలలో భారత బాక్సర్లు పతకాలు ఖాయం చేసుకొన్నారు. మహిళల 48 కిలోల విభాగం ఫైనల్స్ కు భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ అలవోకగా చేరుకొంది. సెమీఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్ కిమ్ హ్యూంగ్ మీని చిత్తు చేయడం ద్వారా… ఆరో ప్రపంచ స్వర్ణానికి గురి […]

ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో మేరీ కోమ్
X
  • ఆరో ప్రపంచ స్వర్ణానికి భారత స్టార్ బాక్సర్ గురి
  • సెమీస్ లో కిమ్ హ్యాంగ్ పై మేరీ గెలుపు

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీల నాలుగు విభాగాలలో భారత బాక్సర్లు పతకాలు ఖాయం చేసుకొన్నారు.

మహిళల 48 కిలోల విభాగం ఫైనల్స్ కు భారత బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ అలవోకగా చేరుకొంది. సెమీఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్ కిమ్ హ్యూంగ్ మీని చిత్తు చేయడం ద్వారా… ఆరో ప్రపంచ స్వర్ణానికి గురి పెట్టింది.

ఊరిస్తున్న ప్రపంచ రికార్డు…

తన కెరియర్ లో ఇప్పటికే 5 ప్రపంచ స్వర్ణాలు సాధించిన 35 ఏళ్ల మేరీ కోమ్…ఆదివారం జరిగే టైటిల్ సమరంలో….ఉక్రెయిన్ బాక్సర్ అన్నా ఒకహోటాతో అమీతుమీ తేల్చుకోనుంది.

మహిళా బాక్సింగ్ చరిత్రలో అత్యధికంగా….ఐర్లాండ్ బాక్సర్ కేటీ టెయిలర్ సాధించిన ఐదు స్వర్ణాల రికార్డును మేరీ కోమ్ గతంలోనే సమం చేసింది.

ఆరో స్వర్ణం సాధించగలిగితే…మేరీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలుగుతుంది.

నాలుగుపతకాలు ఖాయం…

మహిళల 54 కిలోల విభాగంలో మనీషా, 69 కిలోల విభాగంలో లవ్ లీనా బోర్గెయిన్, 81 కిలోల విభాగంలో కచారీ భాగ్యవతి…సెమీఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా… పతకాలు ఖాయం చేసుకొన్న సంగతి తెలిసిందే.

First Published:  22 Nov 2018 3:40 PM IST
Next Story