Telugu Global
NEWS

టీ ఆర్ ఎస్ ఓడితే నాకేం నష్టం లేదు.... వెళ్లి రెస్ట్ తీసుకుంటా .... కానీ

మహాకూటమి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కెసిఆర్ హెచ్చరించారు. ఖానాపూర్ ప్రచార సభలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ ఆర్ ఎస్ ఓడినా తనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. ‘‘ 58 ఏళ్లలో వాళ్లు ఏం చేశారు? వీళ్లేమైనా కొత్తగా వచ్చారా? ఓడిపోంగానే… హిమాలయాలకు పోయి ఆకు పసరు తాగొచ్చరా…. పవిత్రం అయిపోయారా… మళ్లీ నమ్మితే పంటికి అంటకుండా మింగేస్తారు. వాళ్లకు చేతగాక ఆంధ్రాకుపోయి చంద్రబాబు నాయుడుని భుజాలపై తీసుకువస్తున్నారు. మళ్లీ చంద్రబాబు అవసరమా…. కత్తి […]

టీ ఆర్ ఎస్ ఓడితే నాకేం నష్టం లేదు.... వెళ్లి రెస్ట్ తీసుకుంటా .... కానీ
X

మహాకూటమి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కెసిఆర్ హెచ్చరించారు. ఖానాపూర్ ప్రచార సభలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ ఆర్ ఎస్ ఓడినా తనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు.

‘‘ 58 ఏళ్లలో వాళ్లు ఏం చేశారు? వీళ్లేమైనా కొత్తగా వచ్చారా? ఓడిపోంగానే… హిమాలయాలకు పోయి ఆకు పసరు తాగొచ్చరా…. పవిత్రం అయిపోయారా… మళ్లీ నమ్మితే పంటికి అంటకుండా మింగేస్తారు. వాళ్లకు చేతగాక ఆంధ్రాకుపోయి చంద్రబాబు నాయుడుని భుజాలపై తీసుకువస్తున్నారు. మళ్లీ చంద్రబాబు అవసరమా…. కత్తి ఆంధ్రోడు ఇస్తాడు… కానీ పొడిచేది తెలంగాణోడే…. బాబు డబ్బులు ఇవ్వాలి…. టికెట్లు ఇవ్వాలి. రేపు పెత్తనం చంద్రబాబుది వస్తే దరఖాస్తులు పట్టుకుని అమరావతికి పోవాలి. కొంతమంది అమరావతికి బానిసలు.. మిగిలినవాళ్లు ఢిల్లీ గులాములు. ఈ గులాముల పాలన మనకు కావాలా.? సీరియస్‌గా ఆలోచించండి. లేకుంటే దెబ్బతింటారు. టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే నష్టం పెద్దగా ఏం లేదు. గెలిపిస్తే గట్టిగా పని చేస్తా…. లేదంటే ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా…. నష్టపోయేది ఎవరు? తెలంగాణ ప్రజలే” అని కెసిఆర్ హెచ్చరించారు.

First Published:  22 Nov 2018 3:50 PM IST
Next Story