Telugu Global
Cinema & Entertainment

ఆర్-ఆర్-ఆర్.. రంగంలోకి కరణ్ జోహార్

ఆర్-ఆర్-ఆర్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సినిమా ఇలా సెట్స్ పైకి వచ్చిన వెంటనే అలా బిజినెస్ డీల్స్ స్టార్ట్ అయిపోయాయి. శాటిలైట్ రైట్స్ నుంచి డబ్బింగ్ రైట్స్ వరకు.. ఆడియో రైట్స్ నుంచి డిజిటల్ రైట్స్ వరకు.. ఇలా ఎన్నో హక్కుల కోసం వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు రంగంలోకి దిగిపోయారు. వీళ్లలో అందరికంటే ఎక్కువ ఊపు మీదున్నాడు నిర్మాత కమ్ దర్శకుడు కరణ్ జోహార్. బాహుబలి సినిమాతో రాజమౌళి టాలెంట్ ఏంటో కరణ్ జోహార్ కు […]

ఆర్-ఆర్-ఆర్.. రంగంలోకి కరణ్ జోహార్
X

ఆర్-ఆర్-ఆర్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సినిమా ఇలా సెట్స్ పైకి వచ్చిన వెంటనే అలా బిజినెస్ డీల్స్ స్టార్ట్ అయిపోయాయి. శాటిలైట్ రైట్స్ నుంచి డబ్బింగ్ రైట్స్ వరకు.. ఆడియో రైట్స్ నుంచి డిజిటల్ రైట్స్ వరకు.. ఇలా ఎన్నో హక్కుల కోసం వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు రంగంలోకి దిగిపోయారు. వీళ్లలో అందరికంటే ఎక్కువ ఊపు మీదున్నాడు నిర్మాత కమ్ దర్శకుడు కరణ్ జోహార్.

బాహుబలి సినిమాతో రాజమౌళి టాలెంట్ ఏంటో కరణ్ జోహార్ కు బాగా తెలిసొచ్చింది. నార్త్ లో ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహార్.. కళ్లు చెదిరే లాభాలు అందుకున్నాడు. ఆ లాభాలతోనే ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ సినిమాల్ని నడిపిస్తున్నాడు. అందుకే రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్టుపై కూడా కరణ్ కన్నేశాడు. ఎలాగైనా ఈ సినిమా నార్త్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకోవాలని చూస్తున్నాడు.

గతంలో బాహుబలి-2 హిట్ అయినప్పుడు ప్రభాస్, రానాకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు కరణ్ జోహార్. ఇప్పుడు ఆ పరిచయాన్ని వాడుతున్నాడు. ప్రభాస్ ద్వారా ఎన్టీఆర్-చరణ్ మల్టీస్టారర్ రైట్స్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు.

అయితే యూనిట్ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎలాంటి చర్చలు పెట్టుకోవద్దని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఓ మంచి రోజు చూసి చర్చలు ప్రారంభిస్తారట.

First Published:  22 Nov 2018 5:34 AM IST
Next Story