Telugu Global
Cinema & Entertainment

నిర్మాతని ఇబ్బంది పెడుతున్న సునీల్

 హీరో గా మారిన తర్వాత సునీల్ చెప్పుకోదగ్గ విజయాలు సాదించలేదు అనే మాట వాస్తవమే. అందాల రాముడు, మర్యాద రామన్న పెద్ద విజయం సాధించగా, ఓ మోస్తారు విజయం సాదించిన చిత్రం పూల రంగడు. ఇషా చావ్లా తో జత కట్టిన ఈ చిత్రానికి నిర్మాత అంజి రెడ్డి. పూల రంగడు చిత్ర విజయం తర్వాత మళ్ళి సునీల్ తో నే చిత్రం చేద్దాం అనే ఉదేశ్యం తో అక్షరాల కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు […]

నిర్మాతని ఇబ్బంది పెడుతున్న సునీల్
X
హీరో గా మారిన తర్వాత సునీల్ చెప్పుకోదగ్గ విజయాలు సాదించలేదు అనే మాట వాస్తవమే. అందాల రాముడు, మర్యాద రామన్న పెద్ద విజయం సాధించగా, ఓ మోస్తారు విజయం సాదించిన చిత్రం పూల రంగడు. ఇషా చావ్లా తో జత కట్టిన ఈ చిత్రానికి నిర్మాత అంజి రెడ్డి. పూల రంగడు చిత్ర విజయం తర్వాత మళ్ళి సునీల్ తో నే చిత్రం చేద్దాం అనే ఉదేశ్యం తో అక్షరాల కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు నిర్మాత. ఎన్ని సార్లు ప్రయత్నించినా దర్శకుడు దొరక్క, దర్శకుడు దొరికినప్పుడు సునీల్ డేట్స్ దొరక్క ఆ నిర్మాత చాలా రోజులు ఖాళీ గా ఉండిపోయాడు.

ఆ మధ్య సందీప్ కిషన్ హీరో గా ‘ఒక అమ్మాయి తప్ప’ అనే చిత్రం నిర్మించి మరింత నష్టాల్లో కి జారుకున్నాడు. ఈ దశ లో అయిన సునీల్ తో చిత్రం చేద్దాం అని అనుకుంటే, మన స్టార్ కమెడియన్ మాత్రం అందుకు రెడీ గా లేడు. తన అడ్వాన్స్ తిరిగి ఇమ్మంటే నానుస్తున్నాడు అనేది ఫిల్మ్నగర్ వర్గాల వాదన. ప్రస్తుతానికయితే సునీల్ తిరిగి హీరో గా కెరీర్ స్టార్ట్ చెయ్యడం కష్టమే. అలా అని వస్తున్న కమెడియన్ వేషాలని వదులుకోవడం సునీల్ కి సమస్యే. ఈ సమయం లో కష్టాల్లో ఉన్న నిర్మాత ని ఆదుకుంటే సునీల్ కి మంచిది లేకపోతే లేని పోనీ తల నొప్పుల్ని మీదేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం రాక మానదు.

First Published:  22 Nov 2018 11:11 AM IST
Next Story