Telugu Global
National

పిచ్చి పీక్స్.... ఈవీఎం మెషిన్‌కు పూజలు చేసిన మంత్రి

ఒక సినిమాలో పవన్‌కళ్యాణ్ ఇన్విజిలేటర్‌తో ఆన్సర్ షీట్‌పై ‘ఓం’ అని రాయమంటాడు. ఎందుకు అని ఆ ఇన్విజిలేటర్ ప్రశ్నిస్తే.. మీరు ఓం అని రాస్తే నేను పరీక్ష సరిగా రాయగలనని బదులిస్తాడు. ఇది కేవలం కామెడీ కోసం పెట్టిన సీనే. కాని చాలా మంది నిజజీవితంలో కూడా ఆచరిస్తుంటారు. పరీక్షలకు ముందు వారి ఇష్టదైవాలకు మొక్కు కోవడం.. పేపర్స్‌పై సింబల్స్ రాసుకోవడం పరిపాటి. అయితే కష్టపడి చదవకుండా ఇలాంటివి ఎన్ని చేసినా పరీక్ష తప్పడం ఖాయం. ఇప్పుడీ […]

పిచ్చి పీక్స్.... ఈవీఎం మెషిన్‌కు పూజలు చేసిన మంత్రి
X

ఒక సినిమాలో పవన్‌కళ్యాణ్ ఇన్విజిలేటర్‌తో ఆన్సర్ షీట్‌పై ‘ఓం’ అని రాయమంటాడు. ఎందుకు అని ఆ ఇన్విజిలేటర్ ప్రశ్నిస్తే.. మీరు ఓం అని రాస్తే నేను పరీక్ష సరిగా రాయగలనని బదులిస్తాడు. ఇది కేవలం కామెడీ కోసం పెట్టిన సీనే.

కాని చాలా మంది నిజజీవితంలో కూడా ఆచరిస్తుంటారు. పరీక్షలకు ముందు వారి ఇష్టదైవాలకు మొక్కు కోవడం.. పేపర్స్‌పై సింబల్స్ రాసుకోవడం పరిపాటి. అయితే కష్టపడి చదవకుండా ఇలాంటివి ఎన్ని చేసినా పరీక్ష తప్పడం ఖాయం.

ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే….

చత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఈ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి, నవగఢ్ ఎమ్మెల్యే దయాల్ దాస్ చేసిన ఒక పని ఇప్పుడు అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయన ఒక పోలింగ్ బూత్‌కు వెళ్లాడు. అంతే కాకుండా ఆ పోలింగ్ బూత్‌లో పూజలు చేసి.. ఈవీఎం మెషిన్‌కు దండం పెట్టి కొబ్బరి కాయ కొట్టాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు ఈ ఘటనసై వివరణ ఇవ్వాలని మంత్రికి హుకుం జారీ చేశారు. మరోవైపు అసలు ఈ ఘటన ఎన్నో నెంబర్ పోలింగ్ బూత్‌లో జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మంత్రి పూజల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీపై చురకలు అంటిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల కోసం పని చేసుంటే ఇలా ఈవీఎంలకు పూజలు చేసే పరిస్థితి తలెత్తేది కాదని చురకలు అంటించింది. అయితే ఈ ఘటనపై దయాల్‌దాస్ ఇంత వరకు స్పందించలేదు.

First Published:  22 Nov 2018 7:07 AM IST
Next Story