Telugu Global
NEWS

బాధితులు రోడ్డెక్కారు.... అగ్రిగోల్డ్ కేసులో హాయ్ ల్యాండ్ ఎండీ అరెస్ట్

ఎట్టకేలకు హాయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వర రావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. జనాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తరువాత ప్లేటు ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యంతో చేతులు కలిపి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. ఈయనతో కలిపి ఇప్పటికి అగ్రి గోల్డ్ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 27కు చేరుకుంది. అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులలో హాయ్ ల్యాండ్ కూడా ఒకటి. మంగళగిరి సమీపంలోని ప్రధాన వనరుగా ఉన్న హాయ్ ల్యాండ్ ను […]

బాధితులు రోడ్డెక్కారు.... అగ్రిగోల్డ్ కేసులో హాయ్ ల్యాండ్ ఎండీ అరెస్ట్
X

ఎట్టకేలకు హాయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వర రావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. జనాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తరువాత ప్లేటు ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యంతో చేతులు కలిపి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. ఈయనతో కలిపి ఇప్పటికి అగ్రి గోల్డ్ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 27కు చేరుకుంది.

అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులలో హాయ్ ల్యాండ్ కూడా ఒకటి. మంగళగిరి సమీపంలోని ప్రధాన వనరుగా ఉన్న హాయ్ ల్యాండ్ ను తప్పిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం బాధితులంతా కలిసి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళన ఉద్రిక్తతగా మారింది. సీపీఐ నేతలకు తోడు వైసీపీ శ్రేణులు కూడా మద్దతు తెలపడంతో… అణగదొక్కేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అనుమతుల్లేవంటూ ముందస్తు అరెస్టులు చేశారు. అడుగుడుగునా అడ్డుకున్నారు.

అయినా…. బాధితులు హాయ్ ల్యాండ్ వరకు చేరుకున్నారు. అక్కడే వంటావార్పు నిర్వహించి కలిసి తిన్నారు. తామంతా ఆందోళనకారులం కాదని, బాధితులమని పోలీసులకు చెప్పి వేడుకున్నారు.

దాంతో, బుధవారం రాత్రి అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ వెంకట రామరావుతో కలిసి హాయ్‌ల్యాండ్‌ ఎండీ అల్లురి వెంకటేశ్వరరావు కుట్ర చేశారనే ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో సీఐడీ అధికారులు హ్యాయ్ ల్యాండ్ ఎండీని కూడా అదుపులోకి తీసుకున్నారు.

గురువారం సీఐడీ కోర్టులో హాజరు పర్చారు. గతంలో అల్లూరి వెంకటేశ్వర రావు అగ్రిగోల్డ్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేయడంతో ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. 2005 ఆగస్టు 29న హాయ్‌ల్యాండ్‌కు చెందిన ఆర్‌ కాలేజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ బాధ్యతలు ఈయన తీసుకున్నారు.

ఏపీలో అగ్రిగోల్డ్ కుంభకోణంలో వేల కోట్ల చేతులు మారాయి. జనాలను నమ్మించి వసూలు చేసిన సొమ్ము రికవరీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు తిన్న వారిపై కఠినమైన చర్యలు లేకపోవడంపై బాధితులు రోడ్డెక్కుతున్నారు. దీంతో పోలీసులు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బాధితులకు న్యాయం మాత్రం ఇప్పటికీ జరగడం లేదు.

First Published:  22 Nov 2018 10:05 AM GMT
Next Story