ఫ్యాన్స్ పై సీరియస్ అయిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ డైరెక్టర్ గా వస్తున్న సినిమా “రోబో 2.0”. “రోబో” సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని రిలీజ్ రోజే చూడాలి అని దాదాపు అందరూ సినిమా ప్రేక్షకులు భావిస్తున్నారు. దాంతో టికెట్ ల రేట్లు చుక్కలను అంటుకుంటాయి. ఏకంగా ఒక్కో టికెట్ ధర 1000 నుండి 5 వేల రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముతున్నారు. అమ్మేవాళ్ళు […]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ డైరెక్టర్ గా వస్తున్న సినిమా “రోబో 2.0”. “రోబో” సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని రిలీజ్ రోజే చూడాలి అని దాదాపు అందరూ సినిమా ప్రేక్షకులు భావిస్తున్నారు. దాంతో టికెట్ ల రేట్లు చుక్కలను అంటుకుంటాయి.
ఏకంగా ఒక్కో టికెట్ ధర 1000 నుండి 5 వేల రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముతున్నారు. అమ్మేవాళ్ళు ఎంత రేట్ అయిన పెంచుతారు, కానీ ముందుగా సినిమా చూడాలి అని భావించేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు… అందుకే టికెట్ రేట్లు అగ్ర హీరోల సినిమాలకు పెరుగుతూనే ఉంటాయి . అలాంటి వాళ్ళని రజనీకాంత్ హెచ్చరిస్తున్నాడు.
టికెట్ రేట్లు థియేటర్ వాళ్ళు పెంచొద్దు అలాగే అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనద్దు అంతేకాదు అమ్మేవాళ్ళు కూడా నేరం చేసినట్లే. అలాంటి వాళ్ళని అస్సలు క్షమించను అని రజనీకాంత్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే తన అభిమానులు ఎవ్వరు కూడా సినిమా టిక్కెట్ ని బ్లాక్ లో పెట్టి కొనద్దు అని కూడా వార్నింగ్ ఇచ్చాడు రజనీకాంత్.