ఎక్కడ పడుకున్నావమ్మా... " మహిళా రైతుపై సీఎం వ్యాఖ్యలు
కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో చిక్కుకున్నారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులోనూ ఒక మహిళా రైతుపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో సదరు మహిళా రైతు బోరున విలపించడంతో ప్రతిపక్షాలు కూడా కుమారస్వామిపై విరుచుకుపడుతున్నాయి. బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. బెళగావిలో నిరసనకు దిగిన జయశ్రీ అనే మహిళా రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారస్వామి…. ”ఈ నాలుగేళ్లు […]

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో చిక్కుకున్నారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందులోనూ ఒక మహిళా రైతుపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో సదరు మహిళా రైతు బోరున విలపించడంతో ప్రతిపక్షాలు కూడా కుమారస్వామిపై విరుచుకుపడుతున్నాయి. బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు.
బెళగావిలో నిరసనకు దిగిన జయశ్రీ అనే మహిళా రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమారస్వామి…. ”ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నావమ్మా” అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆమె బోరున ఏడ్చేశారు. తనను ఎక్కడ పడుకున్నావ్ అంటూ సీఎం కించపరిచారని ఆమె వాపోయారు.
ఒక మహిళా రైతుపై ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నీచమని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కర్నాటక చరిత్రలోనే లేదన్నారు.