రిటైర్‌మెంట్ ప్రకటించిన సుష్మా స్వరాజ్
ఇంకా ఆమె రాజకీయంగా క్రియాశీలంగా ఉంటారని..ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులను అధిష్టిస్తారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె రిటైర్మెంట్ ను అనౌన్స్ చేశారు. ఇక తను ప్రత్యక్ష పోటీకి దూరం అవుతానని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో దశాబ్దాలుగా క్రియాశీల పాత్ర పోషించిన సుష్మా స్వరాజ్ తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదని ఆమె […]
ఇంకా ఆమె రాజకీయంగా క్రియాశీలంగా ఉంటారని..ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులను అధిష్టిస్తారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె రిటైర్మెంట్ ను అనౌన్స్ చేశారు. ఇక తను ప్రత్యక్ష పోటీకి దూరం అవుతానని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో దశాబ్దాలుగా క్రియాశీల పాత్ర పోషించిన సుష్మా స్వరాజ్ తన రిటైర్మెంట్ ను ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదని ఆమె ప్రకటించారు. దీనికి కారణం ఆమె అనారోగ్యమే అని తెలుస్తోంది. కిందటి ఏడాదే సుష్మా స్వరాజ్ కు మూత్రపిండాల మార్పిడి జరిగింది. అప్పటి నుంచి ఆమె మరీ యాక్టివ్ గా కనిపించడం లేదు.
ఈ నేఫథ్యంలో ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన కూడదని సుష్మ డిసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు.
ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ లోని విదిశ నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని సుష్మా స్వరాజ్ తన పార్టీ వాళ్లకు తెలియజేసినట్టుగా సమాచారం.
మొత్తానికి సుష్మస్వరాజ్ కాస్త అనూహ్యంగానే రిటైర్మెంట్ ను ప్రకటించింది. ఈమె ముందు ముందు ప్రధాని అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మోడీ హవా ముందు చిన్నబోతూ వస్తోంది కానీ.. లేకపోతే సుష్మకు బీజేపీలో మరింత ప్రాధాన్యత దక్కేది.