సస్పెన్స్ థ్రిల్లర్ 'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్ నేడే విడుదల
గరుడవేగ, కార్తికేయ, సింగం 3, కథలో రాజకుమారి…. వంటి హిట్ సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన బీరం సుధాకర్ రెడ్డి నిర్మాతగా చేసిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపాక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో ఈ సినిమాను బీరం సుధాకర్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. బుధవారం రాత్రి 7గంటలకు సుబ్రహ్మణ్యపురం సినిమా ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రయూనిట్ విడుదల చేయనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రముఖ హీరో […]
గరుడవేగ, కార్తికేయ, సింగం 3, కథలో రాజకుమారి…. వంటి హిట్ సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన బీరం సుధాకర్ రెడ్డి నిర్మాతగా చేసిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపాక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో ఈ సినిమాను బీరం సుధాకర్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. బుధవారం రాత్రి 7గంటలకు సుబ్రహ్మణ్యపురం సినిమా ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రయూనిట్ విడుదల చేయనుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రముఖ హీరో సుమంత్, హీరోయిన్ ఈషారెబ్బా నటించారు. భక్తులను అనుగ్రహించాల్సిన దేవుడే వారిపట్ల ఆగ్రహిస్తే… ఫలితాలు ఎలా ఉంటాయి. కాపాడవలసిన వాడే కన్నెర్రజేస్తే ప్రజల పరిస్థితి ఏంటి ? అసలు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? కోపం తెప్పించే పనులు భక్తులు ఏం చేశారు ? వంటి ఆసక్తికర అంశాలతో సుబ్రహ్మణ్యపురం మూవీని తీశామని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెలిపారు.
ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా సస్పెన్స్ థ్రిల్లర్ ను తీర్చిదిద్దడంలో నిర్మాత సుధాకర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని చెప్పారు. నిర్మాత పూర్తి స్వేచ్ఛ, సహకారం ఇవ్వడంతోనే తాము అనుకున్న సబ్జెక్ట్ అనుకున్న విధంగా వెండితెరపై చూపగలిగేలా సినిమాను పూర్తి చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా, యానాం, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
సీనియర్ నటులు సాయికుమార్, సురేష్, ఆలీ ఓ మంచి సినిమాలో మంచిపాత్రలు చేశామని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్కే ప్రసాద్ కెమేరా పనితనం, శేఖర్ చంద్ర సంగీతం ఆకట్టుకుంటాయని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. జొన్నవిత్తుల, పూర్ణాచారి, నరేశ్ పాటలు అందించారు. ఈ సినిమాకు గ్రాఫిక్స్ హైలైట్ గా నిలుస్తాయని, థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయని దర్శకుడు సంతోష్ జాగర్లమూడి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు. సుబ్రహ్మణ్యపురం సినిమాకు మాటలు సంతోష్, నాగమురళి అందించారు. కథ కథనం దర్శకత్వం సంతోష్ జాగర్లమూడి.