తిరగబడ్డ నేతలు.... మధ్యలోనే రఘువీరా నిష్క్రమణ
టీడీపీతో పొత్తును ఏపీ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబుతో కలిసి కాపురం చేయాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించడంతో పార్టీ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు సర్దుకు పోతున్నా కింది స్థాయి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. తిరుపతిలో జరిగిన రాయలసీమ ప్రాంత కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ముందే నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు […]
టీడీపీతో పొత్తును ఏపీ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబుతో కలిసి కాపురం చేయాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించడంతో పార్టీ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ నేతలు సర్దుకు పోతున్నా కింది స్థాయి నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.
తిరుపతిలో జరిగిన రాయలసీమ ప్రాంత కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ముందే నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.
చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను చిత్రహింసలు పెట్టారని…. కొందరిని హత్యలు కూడా చేయించారని అలాంటి చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఏమిటని నిలదీశారు.
చంద్రబాబు నీడకు చేరి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారంటూ స్థానిక నేతలు పార్టీ పెద్దలపై మండిపడ్డారు. సర్దిచెప్పేందుకు రఘువీరా రెడ్డి ప్రయత్నించినా నేతలు లెక్కచేయలేదు. దీంతో రఘువీరా రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తిరుపతిలో ఈ సమావేశం జరిగినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి… వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశాలేవీ లేవన్నారు.
- Andhra Pradeshandhra pradesh telugu congress partyChandrababu NaiduCONgresscongress cadercongress leaderscongress tdp alliancefiremeetingRaghuveera Reddyrayalaseemarayalaseema congress leaders meetingrayalaseema congress leaders meeting in tirupati congress cader fire on raghuveera reddytelugu congress partytirupatitirupati congress cader