రెమ్యూనరేషన్ 2 కోట్లు.. నిజమేనా?
హీరో 2 కోట్లు తీసుకుంటాడు. 2 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్లు, డైరక్టర్లు కూడా ఉన్నారు. దేవిశ్రీ లాంటి మ్యూజిక్ డైరక్టర్ కూడా 2 కోట్లు తీసుకుంటాడు. కానీ ఓ కథా రచయిత 2 కోట్లు తీసుకుంటాడా..? ఇప్పటివరకు ఊహించడమే కష్టమైన ఈ ఫిగర్ ను ఓ కథారచయిత తీసుకుంటున్నాడు. అతడే బెజవాడ ప్రసన్నకుమార్. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కథారచయిత ఇతడు. ఇతడి దగ్గరున్న స్పెషాలిటీ ఏంటంటే.. కథ ఇతడే రాస్తాడు. దానికి డైలాగ్స్ ఇతడే […]
హీరో 2 కోట్లు తీసుకుంటాడు. 2 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్లు, డైరక్టర్లు కూడా ఉన్నారు. దేవిశ్రీ లాంటి మ్యూజిక్ డైరక్టర్ కూడా 2 కోట్లు తీసుకుంటాడు. కానీ ఓ కథా రచయిత 2 కోట్లు తీసుకుంటాడా..? ఇప్పటివరకు ఊహించడమే కష్టమైన ఈ ఫిగర్ ను ఓ కథారచయిత తీసుకుంటున్నాడు. అతడే బెజవాడ ప్రసన్నకుమార్.
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కథారచయిత ఇతడు. ఇతడి దగ్గరున్న స్పెషాలిటీ ఏంటంటే.. కథ ఇతడే రాస్తాడు. దానికి డైలాగ్స్ ఇతడే రాస్తాడు. పైపెచ్చు స్క్రీన్ ప్లే కూడా అందిస్తాడు. వీటికి తోడు నేను లోకల్ లాంటి హిట్ ఇచ్చాడు. అందుకే ఇతడికి 2 కోట్లు ఇవ్వడానికి ఎవరూ వెనకాడ్డం లేదు.
ఇలా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగంలో వర్కవుట్ చేసే టెక్నీషియన్లు ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు. ఉన్నవాళ్లలో కోన వెంకట్ లా ఫేడవుట్ అయినవాళ్లే ఎక్కువమంది. ఇప్పుడిప్పుడే లైమ్ లైట్లోకి వస్తున్న బెజవాడ ప్రసన్నకుమార్ లాంటి వ్యక్తులకు అందుకే అంత డిమాండ్.
ప్రస్తుతం ఈ హీరో రవితేజ కోసం ఓ కథ, వెంకటేశ్ కోసం మరో కథ రెడీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం చెరో 2 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నాడు.