Telugu Global
NEWS

చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన మమతా బెనర్జీ, మాయావతి

అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటిలా మారింది చంద్రబాబు పరిస్థితి. ఎంతో ఉత్సాహంతో కోల్ కతా వెళ్లిన బాబు అక్కడ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశాక తత్త్వం బోధపడిందట… బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దన్నలా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలన్న బాబు ఆశలపై మమత నీళ్లు చల్లిందని కోల్ కతా నుంచి వార్తలు బయటకు వచ్చాయి. అందుకే మమతతో భేటి తర్వాత ఇతర నేతలను కలవకుండా చంద్రబాబు సైలెంట్ అయిపోయారట. బెంగాల్ సీఎంతో భేటిలో చంద్రబాబు ప్రతిపాదనను […]

చంద్రబాబుకు షాక్‌ ఇచ్చిన మమతా బెనర్జీ, మాయావతి
X

అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటిలా మారింది చంద్రబాబు పరిస్థితి. ఎంతో ఉత్సాహంతో కోల్ కతా వెళ్లిన బాబు అక్కడ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశాక తత్త్వం బోధపడిందట… బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దన్నలా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలన్న బాబు ఆశలపై మమత నీళ్లు చల్లిందని కోల్ కతా నుంచి వార్తలు బయటకు వచ్చాయి. అందుకే మమతతో భేటి తర్వాత ఇతర నేతలను కలవకుండా చంద్రబాబు సైలెంట్ అయిపోయారట.

బెంగాల్ సీఎంతో భేటిలో చంద్రబాబు ప్రతిపాదనను మమత సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమికి మమత నో చెప్పారట…. ఇప్పుడే ఈ ప్రతిపాదన వద్దని…. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి ఓ అంచనాకు వద్దామని బాబుకు సూచించారట. అంతేకాదు.. ప్రాంతీయ పార్టీల కూటమికి ఓకే కానీ.. అందులో కాంగ్రెస్ ఉండొద్దని మమత పెట్టిన మెలికకు బాబు షాకయ్యారని తెలిసింది. కూటమికి బాస్ గా కాంగ్రెస్ ఉండడానికి మమత సూతారం ఇష్టపడకపోవడం బాబు ముందరకాళ్లకు బంధం వేసినట్లయిందని పరీశీలకులు చెబుతున్నారు.

అంతకుముందు మాయావతిని కలిసినప్పుడు కూడా బాబుకు ఇదే ప్రశ్న ఎదురైందట. కూటమి ఏర్పాటుకు ఓకే కానీ…. కూటమికి పెద్దన్నలా కాంగ్రెస్ ను ఉంచడానికి మాత్రం బెహన్జీ బీఎస్పీ అధినేత్రి మాయవతి నో చెప్పారట. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి నడవకుండా ఒంటరిగా వెళ్తున్న ఆమె కాంగ్రెస్ పెద్దన్న పాత్రను పోషించే బాబు కలల కూటమికి నో చెప్పడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

చంద్రబాబు 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా…. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు దిశగా కాలికి బలపం కట్టుకొని దేశమంతా పర్యటిస్తున్నారు. ప్రాంతీయ నేతల అధ్యక్షులను కలుస్తున్నారు. ఇదే విషయాన్ని రాహుల్ చెవిలో కూడా వేస్తున్నారు. కర్నాటకలో దేవేగౌడ, తమిళనాడులో స్టాలిన్, మహారాష్ట్ర లో శరద్ పవర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జాతీయ నేత ఫారుక్ అబ్దుల్లాలను కలిసి చర్చలు జరిపారు.

ఇందులో చాలా మంది కాంగ్రెస్ నేతృత్వంలో రాహుల్ సారథ్యంలో కూటమిగా ఉండడానికి ఎప్పుడో ఒప్పుకున్నారు. బెంగాల్ సీఎం మమత, బీఎస్పీ అధినేత్రి మాయవతి మాత్రం రాహుల్-కాంగ్రెస్ ను దీనికి పెద్దన్నగా ఒప్పుకోమని చంద్రబాబుకు స్పష్టం చేశారట. కాంగ్రెస్ లీడ్ పార్టీగా ఉండడానికి ససేమిరా అంటున్నారట.. దీంతో మోడీకి దిమ్మదిరిగే షాక్ ఇద్దామని మొదలుపెట్టిన బాబు ప్రయాణం ఆదిలోనే హంసపాదులా మారింది.

First Published:  21 Nov 2018 7:22 AM IST
Next Story