Telugu Global
NEWS

కేటీఆరే కాబోయే సీఎం.... ఆయన నోటి నుంచే ఆ మాట..!

తెలంగాణకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ ఎప్పుడైతే భావించారో రాజకీయ, మీడియా సర్కిల్స్‌లో వినిపించిన ఒకే ఒక రూమర్.. నెక్ట్స్ సీఎం కేటీఆర్ అని. తన కొడుకుకు రాజకీయ వారసత్వం ఇవ్వాలని భావించి…. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్ భావించే ముందస్తుకు వెళ్లాడని పలువురు చెబుతుంటారు. అయితే అసెంబ్లీ రద్దు తర్వాత పెట్టిన మీడియా సమావేశాలలో కేటీఆర్ మాత్రం తమ నాయకుడు కేసీఆర్ అని… ఆయనే కాబోయే సీఎం అని…. కారు ఆగదు […]

కేటీఆరే కాబోయే సీఎం.... ఆయన నోటి నుంచే ఆ మాట..!
X

తెలంగాణకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ ఎప్పుడైతే భావించారో రాజకీయ, మీడియా సర్కిల్స్‌లో వినిపించిన ఒకే ఒక రూమర్.. నెక్ట్స్ సీఎం కేటీఆర్ అని. తన కొడుకుకు రాజకీయ వారసత్వం ఇవ్వాలని భావించి…. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయమని కేసీఆర్ భావించే ముందస్తుకు వెళ్లాడని పలువురు చెబుతుంటారు.

అయితే అసెంబ్లీ రద్దు తర్వాత పెట్టిన మీడియా సమావేశాలలో కేటీఆర్ మాత్రం తమ నాయకుడు కేసీఆర్ అని… ఆయనే కాబోయే సీఎం అని…. కారు ఆగదు డ్రైవర్ మారడు అంటూ చెబుతూ వచ్చారు.

నిన్న కేవీ రంగారెడ్డి మనుమడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశాక ఒక విషయం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న విశ్వేశ్వర రెడ్డిని స్వయంగా కేటీఆర్ కలిసి…. పార్టీని వీడొద్దు…. రాబోయే 15, 20 ఏండ్లు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పినట్లు తెలిసింది. అంటే ప్రస్తుత ఎన్నికల తర్వాత కేటీఆర్‌కు పట్టాభిషేకం జరగడం ఖాయం అన్నమాట.

తన కొడుకు పొలిటికల్ కెరీర్‌కు అడ్డుపడకూడదనే మేనల్లుడు హరీర్‌రావును కూడా కట్టడి చేశారన్నది బహిరంగ రహస్యమే. కేవలం సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే హరీష్‌ను పరిమితం చేశారు. సీట్ల పంపిణీ తర్వాత అసంతృప్తుల్లో వచ్చిన వ్యతిరేకతను తగ్గించే బాధ్యతను కేటీఆర్‌కే అప్పగించారు. బుజ్జగింపులు, బెదిరింపులు ఏదైతే ఏమి అన్నీ కేటీఆర్ భుజాల మీద వేశారు కేసీఆర్.

ఇక ఇప్పుడు కేటీఆర్ స్వయంగా తన నోటి తోనే ‘నేనే సీఎం’ అవుతున్నానని ఒక ఎంపీతో చెప్పాడంటే టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ నాయకుడు ఎవరో తెలిసిపోయింది. అయితే ఎన్నికలు అయిన వెంటనే కేటీఆర్‌ను సీఎం చేస్తారా..? లేదా 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాతనా అనేది కాస్త సందిగ్దంగా ఉంది.

First Published:  21 Nov 2018 7:15 AM IST
Next Story