Telugu Global
NEWS

విజయవాడ లోక్‌సభ బరిలో సుప్రీం కోర్టు న్యాయవాది

విజయవాడ లోక్‌సభ స్థానం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మంగా మారింది. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ గెలుపు టీడీపీకి అత్యవసరం. పైగా టీడీపీకి వెన్నంటి ఉండే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న లోక్‌సభ స్థానం కూడా ఇదే. వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నానినే టీడీపీ మరోసారి బరిలో దింపబోతోంది. టీడీపీకి చెక్‌ పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. అటు బీజేపీ కూడా విజయవాడలో గెలవకపోయినా టీడీపీని చావుదెబ్బకొట్టాలన్న […]

విజయవాడ లోక్‌సభ బరిలో సుప్రీం కోర్టు న్యాయవాది
X

విజయవాడ లోక్‌సభ స్థానం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మంగా మారింది. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ గెలుపు టీడీపీకి అత్యవసరం. పైగా టీడీపీకి వెన్నంటి ఉండే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న లోక్‌సభ స్థానం కూడా ఇదే.

వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నానినే టీడీపీ మరోసారి బరిలో దింపబోతోంది. టీడీపీకి చెక్‌ పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. అటు బీజేపీ కూడా విజయవాడలో గెలవకపోయినా టీడీపీని చావుదెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతోంది. తమను దూరం చేసుకున్న టీడీపీకి సత్తా చూపించాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా వ్యాపారవేత్త, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన కిలారు దిలీప్‌ను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే విజయవాడ లోక్‌సభ బీజేపీ కన్వీనర్‌గా దిలీప్‌ను బీజేపీ నియమించింది. ఈయన కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. విజయవాడ లోక్‌సభ పరిధిలో మంచి పరిచయాలున్నాయి.

విజయవాడ లోక్‌సభ పరిధిలో దిలీప్‌ ఇప్పటికే తన కార్యాచరణ మొదలుపెట్టారు. బీజేపీ ఓటు బ్యాంకును సంఘటితం చేసే పనిలో ఉన్నారు. తనకున్న పరిచయాల ద్వారా టీడీపీకి అనుకూలంగా ఉన్న సామాజికవర్గాన్ని కూడా ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

విజయవాడలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ వల్ల టీడీపీకి దక్కిన ఓట్లను ఈసారి అటు వెళ్లకుండా నిలబెడితే చాలన్నది బీజేపీ నేతల ఆలోచన. అలా చేయగలిగితే టీడీపీని ఓడించవచ్చని భావిస్తోంది. తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని…. త్వరలోనే తన ఆఫీస్‌ను కూడా ప్రారంభిస్తానని దిలీప్‌ చెబుతున్నారు.

ఈ పరిణామం టీడీపీని కలవర పెడుతోంది. అయితే కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బీజేపీ నిలబెట్టినా ఆ వర్గం ఓటింగ్ టీడీపీకి కాదని వెళ్లే అవకాశమే లేదని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  21 Nov 2018 12:32 AM GMT
Next Story