Telugu Global
NEWS

తొలి టీ-20లో టీమిండియాకు కంగారూల షాక్

టీమిండియాపై 4 పరుగులతో నెగ్గిన ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా టీమిండియా ఓటమి టీమిండియాను ఆదుకోని శిఖర్ ధావన్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటనను …విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా…బ్రి స్బేన్ గబ్బా  స్టేడియం వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో కంగారూ టీమ్ 4 పరుగుల తేడాతో విరాట్ సేనపై సంచలన విజయం సాధించింది. కెప్టెన్ స్టీవ్ […]

తొలి టీ-20లో టీమిండియాకు కంగారూల షాక్
X
  • టీమిండియాపై 4 పరుగులతో నెగ్గిన ఆస్ట్రేలియా
  • డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా టీమిండియా ఓటమి
  • టీమిండియాను ఆదుకోని శిఖర్ ధావన్ ధూమ్ ధామ్ బ్యాటింగ్

ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటనను …విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఓటమితో ప్రారంభించింది.

తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా…బ్రి స్బేన్ గబ్బా స్టేడియం వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో కంగారూ టీమ్ 4 పరుగుల తేడాతో విరాట్ సేనపై సంచలన విజయం సాధించింది.

కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా… ఆస్ట్రేలియా…తనకంటే రెండు ర్యాంకులు పైనున్న టీమిండియాను అధిగమించగలిగింది.

వానదెబ్బ….

ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న టీమిండియా… 17 ఓవర్లలో ప్రత్యర్థిని 4 వికెట్లకు 158 పరుగుల స్కోరుకు కట్టడి చేయగలిగింది. మాక్స్ వెల్ 46 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

వర్షం దెబ్బతో 17 ఓవర్లకు కుదించిన ఈమ్యాచ్ లో 174 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా చివరకు 7 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ధావన్ ధనాధన్…

ఓపెనర్ శిఖర్ ధావన్ 10 బౌండ్రీలు, 2 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించినా..ప్రయోజనం లేకపోయింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ 4, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 7 పరుగుల స్కోర్లు మాత్రమే సాధించగలిగారు.

దీంతో ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం..4 పరుగులతో విజేతగా నిలవడం ద్వారా…1-0 ఆధిక్యం సంపాదించింది.

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్…మెల్బోర్న్ వేదికగా ఈనెల 23న జరుగుతుంది.

టీమిండియాదే పైచేయి….

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ రెండుజట్లూ 16 సార్లు తలపడితే టీమిండియా 10 విజయాలు, ఆస్ట్రేలియా 6 విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఏడాది సస్పెన్షన్ కారణంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోడంతో… టీమిండియానే హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగినా తొలి టీ-20లో పరాజయం తప్పలేదు.

ఆస్ట్రేలియా గడ్డపైన ప్రస్తుత బ్రిస్బేన్ టీ-20 వరకూ ఏడుమ్యాచ్ లు ఆడిన టీమిండియా 4 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో నిలిచింది.

First Published:  21 Nov 2018 4:07 PM IST
Next Story