రవితేజ అంటే భయపడుతున్న నిర్మాతలు
వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్లకు హీరో రవితేజ డేట్స్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ ను ఇచ్చి సినిమాను తీయమంటే ఆయన మాత్రం సినిమాని ఏ మాత్రం సీరియస్ తీసుకోకుండా “అమర్ అక్బర్ అంటోనీ” లాంటి సినిమాని తీసాడు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిపోయింది. ఈ పరాజయంతో మైత్రీ మూవీ మేకర్స్ కూడ ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వీళ్ళు రవితేజ […]
వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్లకు హీరో రవితేజ డేట్స్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ ను ఇచ్చి సినిమాను తీయమంటే ఆయన మాత్రం సినిమాని ఏ మాత్రం సీరియస్ తీసుకోకుండా “అమర్ అక్బర్ అంటోనీ” లాంటి సినిమాని తీసాడు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిపోయింది. ఈ పరాజయంతో మైత్రీ మూవీ మేకర్స్ కూడ ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే వీళ్ళు రవితేజ తో ఇంకో సినిమా ప్లాన్ చేసారు. సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ గా తమిళ్ “తేరి” సినిమాని రీమేక్ చేద్దాం అని ప్లాన్ చేసారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ సినిమా ని చేయకూడదని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ఎందుకంటే రవితేజ వల్ల ఇప్పటికే చాలా నష్టపోయారు ఈ నిర్మాతలు. ఇప్పుడు మళ్ళి రవితేజతో సినిమా చేసే దైర్యం లేదట ఈ నిర్మాతలకి. అలాగే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కి కూడా హిట్స్ లేవు కాబట్టి మళ్ళి రిస్క్ చేయదలుచుకోలేదట మైత్రీ మూవీ మేకర్స్. పాపం మరి రెండేళ్ళ నుంచి మైత్రి వాళ్ళని నమ్మిన సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు ఎం చేస్తాడో చూడాలి.