ఏపీ బార్ కౌన్సిల్ లోకి చొరబడ్డ అవినీతి.... ఓటుకు కోటి రూపాయలు
ఏపీ బార్ కౌన్సిల్‌లో ఓటుకు నోటు వ్యవహారం సంచలనంగా మారింది. బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో ఓటుకు ఏకంగా కోటి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యవహారంపై న్యాయవాదులు విచారణ కోరుతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23వేల మంది న్యాయవాదులు ఓటేసి 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ 25 మంది సభ్యులు బార్ కౌన్సిల్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి […]
ఏపీ బార్ కౌన్సిల్‌లో ఓటుకు నోటు వ్యవహారం సంచలనంగా మారింది. బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఒక్కో ఓటుకు ఏకంగా కోటి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యవహారంపై న్యాయవాదులు విచారణ కోరుతున్నారు.
ఇటీవల ఏపీలో జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23వేల మంది న్యాయవాదులు ఓటేసి 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ 25 మంది సభ్యులు బార్ కౌన్సిల్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 25 మంది సభ్యులలో చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న వారు ఆఫర్లు ఇస్తున్నారు. ఒక్కో ఓటుకు కోటి రూపాయలు ఇస్తామంటున్నారు.
ఐదేళ్ల పాటు ఉండే ఈ పదవికి కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం భారీగా డబ్బులు ఎరవేస్తున్నట్టు భావిస్తున్నారు.