Telugu Global
NEWS

ఫలించిన రేవంత్ చాణక్యం.... 23న కాంగ్రెస్‌లోకి చేవెళ్ల ఎంపీ?

టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతూ ఇవాళ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంత కాలంగా పట్నం మహేందర్ రెడ్డితో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కొండాను ఎలాగైనా కాంగ్రెస్‌లోకి తీసుకొని రావాలని కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పావులు కదిపినట్లు తెలుస్తోంది. కొడంగల్‌లోనే కాకుండా పూర్వ రంగారెడ్డి జిల్లాలో తనకు ప్రత్యర్థిగా మారిన మంత్రి మహేందర్ ‌రెడ్డికి ఎలాగైనా చెక్ […]

ఫలించిన రేవంత్ చాణక్యం.... 23న కాంగ్రెస్‌లోకి చేవెళ్ల ఎంపీ?
X

టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతూ ఇవాళ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంత కాలంగా పట్నం మహేందర్ రెడ్డితో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కొండాను ఎలాగైనా కాంగ్రెస్‌లోకి తీసుకొని రావాలని కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి పావులు కదిపినట్లు తెలుస్తోంది.

కొడంగల్‌లోనే కాకుండా పూర్వ రంగారెడ్డి జిల్లాలో తనకు ప్రత్యర్థిగా మారిన మంత్రి మహేందర్ ‌రెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని రేవంత్ భావించారని…. అందుకే ఆ పార్టీలో సరైన ప్రాధాన్యం లభించక అసంతృప్తితో ఉన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని తనవైపు తిప్పుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వస్తే ఎంపీ టికెట్ ఇచ్చే బాధ్యతను కూడా రేవంత్ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒకే దెబ్బకు రెండు పిట్టల చందంగా…. ఎంపీ కొండాను కాంగ్రెస్‌లో చేర్పించి…. హైకమాండ్ దృష్టిని ఆకర్షించడంతో పాటు…. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సబిత కుటుంబానికి ఆ టికెట్‌ దక్కకుండా చేయాలనే వ్యూహం రచించారని సమాచారం.

కొండాకు స్పష్టమైన హామీ లభించినందువల్లే ఆయన టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని…. 23వ తేదీన జరిగే సోనియా బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

First Published:  20 Nov 2018 2:28 PM IST
Next Story