పవన్ పోటీ చేసే సీట్ల జాబితాలోకి మరో రెండు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. తొలుత అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాని కొద్ది రోజులకే మాట మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాన్ని తాను పోటీ చేసే స్థానంగా పవన్ ప్రకటిస్తూ వస్తూ తికమకపెడుతున్నారు. ఒక దశలో చిరంజీవి గెలిచిన తిరుపతి నుంచి పోటీ చేస్తారని చెప్పారు. చివరకు ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. తొలుత అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాని కొద్ది రోజులకే మాట మార్చారు.
ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాన్ని తాను పోటీ చేసే స్థానంగా పవన్ ప్రకటిస్తూ వస్తూ తికమకపెడుతున్నారు. ఒక దశలో చిరంజీవి గెలిచిన తిరుపతి నుంచి పోటీ చేస్తారని చెప్పారు.
చివరకు ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన పాడేరుకు వెళ్లి అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు పవన్. అయితే ఇప్పుడు పవన్ ఆలోచన మరికొన్ని సీట్లపై పడింది. సేఫ్‌గా తూర్పుగోదావరి జిల్లా నుంచే పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నారు.
ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ వెల్లడించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన… కాకినాడ రూరల్, లేదా కాకినాడ సిటీ, లేదా పిఠాపురం నియోజక వర్గాల నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు.
కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురంతో పాటు అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా పోటీకి పవన్ ఆసక్తి చూపుతున్నారని వివరించారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో పవన్ పర్యటనలకు జనం స్వచ్చందంగా భారీగా తరలివస్తున్నారని ఆయన వివరించారు.