Telugu Global
NEWS

కుట్రను చేధించిన వెంకట్రామిరెడ్డి, లోకేశ్వర్‌ రెడ్డి, సుధాకర్ రెడ్డి

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే పోల్ మేనేజ్‌మెంట్ అంటూ చెబుతూ వచ్చారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించేందుకు టీడీపీ నేతలకు పాఠాలు కూడా చెబుతామన్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అన్నట్టుగానే ఆయన లోలోన పోల్ మేనేజ్‌మెంట్ చేశారు. అధికారులను లోబరుచుకుని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్పించడం చేస్తున్నారని ఆరోపణలు […]

కుట్రను చేధించిన వెంకట్రామిరెడ్డి, లోకేశ్వర్‌ రెడ్డి, సుధాకర్ రెడ్డి
X

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే పోల్ మేనేజ్‌మెంట్ అంటూ చెబుతూ వచ్చారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కల్పించేందుకు టీడీపీ నేతలకు పాఠాలు కూడా చెబుతామన్నారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అన్నట్టుగానే ఆయన లోలోన పోల్ మేనేజ్‌మెంట్ చేశారు. అధికారులను లోబరుచుకుని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్పించడం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

పలు నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదులు కూడా చేశారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్ల నమోదు ఏ స్థాయిలో ఉందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అయితే ఏపీలో దొంగ ఓట్ల బాగోతం సాక్ష్యాధారాలతో సహా ఇటీవల బయటకు వచ్చింది. జనవిజ్ఞాన వేదిక కూడా ఆ వివరాలను ప్రజలకు వివరించింది.

ఏపీలో ఏకంగా 52 లక్షల 67 వేల దొంగ ఓట్లను చేర్చారు. అందులో 18 లక్షల ఓట్లు అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఉన్నాయి. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి తిరిగి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీకి వచ్చి ఓట్లేసే వారు వీరంతా. ఈ బోగస్‌ బాగోతాన్ని మొత్తం పక్కా సాక్ష్యాధారాలతో వైసీపీ ధర్మవరం ఇన్‌చార్జ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఐఐఎం లోకేశ్వర్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్‌ సుధాకర్‌ రెడ్డిలు కలిసి చేధించారు.

వెంకట్రామి రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీం దాదాపు ఏడాది కాలంగా ఈ అంశంపై శోధన చేస్తోంది. అలా కష్టపడి ఏపీ ఓటర్ల జాబితాలోనే అసాధారణ లీలలను వెలికి తీశారు. పుట్టిన పిల్లాడి పేరుతోనే ఓట్లు, రెండు వందల సంవత్సరాలు వయసున్న వారికి ఓట్లు, చనిపోయిన వారి పేర్ల మీద ఓట్లు, టీడీపీ కార్యకర్తలకు ఒకే ఊరిలో రెండు వార్డుల్లో రెండు ఓట్లు, తెలంగాణలో, ఏపీలో రెండు చోట్ల ఓట్లు…. భర్త పేరుతో ఒకచోట, తండ్రిపేరుతో మరొక చోట ఓట్లు చేర్చిన వైనం ఇలా అన్నింటిని బయటపెట్టారు.

ఆ వివరాలతో వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆషామాషిగా కాకుండా పక్కాగా పిటిషన్ వేశారు. 52 లక్షల 67 వేల బోగస్‌ ఓట్లకు సంబంధించిన వివరాలతో కూడిన 25 పెన్‌డ్రైవ్‌లను కోర్టు ముందుంచారు. 64 జీబీతో ఈ డేటా ఉంది.

ఆ పెన్‌డ్రైవ్‌ లను ఎక్కడ ఓపెన్‌ చేసి చెక్‌ చేసినా ఆ బోగస్‌ ఓట్ల బాగోతాన్ని మొత్తం బయటకు వచ్చేలా రూపకల్పన చేసి కోర్టుకు సమర్పించారు. ఈ స్థాయిలో బోగస్‌ బాగోతం చూసి హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విచారణకు పిటిషన్‌ను స్వీకరించింది.

పెద్దల కనుసన్నల్లో జరిగిన బోగస్ ఓట్ల కుంభకోణాన్ని చేధించిన వెంకట్రామి రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, సుధాకర్‌ రెడ్డిలను పలువురు అభినందిస్తున్నారు.

First Published:  20 Nov 2018 2:05 PM IST
Next Story