Telugu Global
NEWS

దొంగ ఓట్ల పై హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పిటిషన్‌

ఏపీలో భారీగా నమోదైన బోగస్‌ ఓట్లపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అసాధారణ స్థాయిలో 52 లక్షల 67 వేల ఓట్లు నమోదు కావడాన్ని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. కొందరు ఓటర్లు ఏపీలో, తెలంగాణలో రెండు చోట్ల ఓటర్లుగా నమోదు అయి ఉన్నారు. అలా నమోదు అయిన వాళ్ళ సంఖ్య 18 లక్షల 50 వేల ఓట్లుగా ఉంది అని కోర్టు దృష్టికి పిటిషనర్‌ తీసుకొచ్చారు. […]

దొంగ ఓట్ల పై హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పిటిషన్‌
X

ఏపీలో భారీగా నమోదైన బోగస్‌ ఓట్లపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అసాధారణ స్థాయిలో 52 లక్షల 67 వేల ఓట్లు నమోదు కావడాన్ని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.

కొందరు ఓటర్లు ఏపీలో, తెలంగాణలో రెండు చోట్ల ఓటర్లుగా నమోదు అయి ఉన్నారు. అలా నమోదు అయిన వాళ్ళ సంఖ్య 18 లక్షల 50 వేల ఓట్లుగా ఉంది అని కోర్టు దృష్టికి పిటిషనర్‌ తీసుకొచ్చారు.

ఈ ఓటర్లు తొలుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి…. తిరిగి 2019లో జరిగి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు.

వాటిని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏపీలో కొత్తగా చేర్చిన 34 లక్షల 17వేల ఓట్లలో అత్యధిక శాతం ఓట్లు బోగస్సేనని కోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. చనిపోయిన వారి పేర్ల మీద కూడా ఓట్లు ఉండడాన్ని వివరించారు.

ఒక్కో వ్యక్తికి పలు చోట్ల ఓట్లు ఉన్నాయని పిటిషన్ తెలిపారు. ఓటర్ల లిస్ట్‌లో అసాధారణ స్థాయిలో జరిగిన అక్రమాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

బోగస్‌ ఓట్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు డిసెంబర్‌ 11కు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

First Published:  20 Nov 2018 3:17 AM GMT
Next Story