సోనియా సభ మగాళ్లకు మాత్రమేనా? " విజయశాంతి ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎవరికీ పాలుపోవడం లేదు. ఒక పద్దతి పాడు లేకుండా ఎన్నికలకు పార్టీ వెళ్తోందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు ముందుకెళ్తున్నారన్న విమర్శ వస్తోంది. ఈనెల 23న సోనియాగాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణమైంది. సోనియాకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సదరు ఫ్లెక్సీలో అంతా మగాళ్లే ఉన్నారు. చోటా నేతలు మొదలుకుని జానారెడ్డి వరకు అంతా మగాళ్లే. […]
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎవరికీ పాలుపోవడం లేదు. ఒక పద్దతి పాడు లేకుండా ఎన్నికలకు పార్టీ వెళ్తోందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు ముందుకెళ్తున్నారన్న విమర్శ వస్తోంది. ఈనెల 23న సోనియాగాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణమైంది.
సోనియాకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సదరు ఫ్లెక్సీలో అంతా మగాళ్లే ఉన్నారు. చోటా నేతలు మొదలుకుని జానారెడ్డి వరకు అంతా మగాళ్లే. ఒక్క మహిళ ఫొటో కూడా లేదు. చివరకు సీనియర్ నేతలైన గీతారెడ్డి, డీకే అరుణ లాంటి వారికి కూడా చోటు దక్కలేదు.
స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న విజయశాంతికి కూడా ఫ్లెక్సీలో చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో విజయశాంతి పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని విమర్శలు చేసే మనం… మరి ఫ్లెక్సీలో ఒక్క మహిళా నేతకు కూడా ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించిన కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు చేసింది ఏమిటని ప్రశ్నించారు.
సోనియా గాంధీ సభ మగాళ్లకు మాత్రమేనా అని ప్రశ్నించారు. ఆడవాళ్లు కూడా సభకు హాజరువుతారు కదా అని నిలదీశారు. విజయశాంతి విలువైన పాయింటే లేవదీసినా అందుకు సమాధానం చెప్పే నేత ఎవరో కాంగ్రెస్‌లో అర్థం కావడం లేదు.