చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉంది.... జనం చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు " యానం మంత్రి కృష్ణారావు
ఏపీలో చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయపడ్డారు యానం మంత్రి, సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన…అన్ని రంగాల ప్రజలు చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. చాన్స్ కోసం జనం ఎదురుచూస్తున్నారని చెప్పారు. దాని ఫలితం 2019లో చూడబోతున్నామని జోస్యం చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు పనికి రారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు ఏమైనా […]
ఏపీలో చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయపడ్డారు యానం మంత్రి, సీనియర్ నేత మల్లాడి కృష్ణారావు. ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన…అన్ని రంగాల ప్రజలు చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. చాన్స్ కోసం జనం ఎదురుచూస్తున్నారని చెప్పారు. దాని ఫలితం 2019లో చూడబోతున్నామని జోస్యం చెప్పారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు పనికి రారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు ఏమైనా పనికొస్తారేమో అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, మోడీల ఇగో వల్లే ఏపీకి ఇబ్బందులు వస్తున్నాయని కృష్ణారావు విశ్లేషించారు. హత్యాయత్నాన్ని తొలుత జగన్ కూడా లైట్ తీసుకున్నట్టే కనిపించిందన్నారు.
ఘటన జరిగిన గంటలోపే డీజీపీ, టీడీపీ నేతలు స్పందించిన తీరు చూశాకే కొత్త అనుమానాలు వచ్చి హైకోర్టుకు వెళ్లి ఉంటారని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి చంద్రబాబుకు మధ్య అవగాహన ఉందేమో గానీ… తనకు చంద్రబాబుకు మధ్య అవగాహన లేదన్నారు. చంద్రబాబు ఒకప్పుడు మిత్రుడే కానీ.. ఇప్పుడు మాత్రం తనకు మిత్రుడు కాదని కృష్ణారావు వ్యాఖ్యానించారు.