వరుసగా ఇసుక లారీలు ఢీ కొడుతుండడంపై పవన్ అంతర్గత చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పైనే హత్యాయత్నం జరగడం… ఆ కేసులో కనీస నిజాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో ప్రతిపక్ష నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తన భద్రతపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి కొందరు ప్రయత్నిస్తున్నారని కొద్దిరోజుల క్రితం బహిరంగ సభలోనే పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్ల పైనా అనుమానాలు […]
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పైనే హత్యాయత్నం జరగడం… ఆ కేసులో కనీస నిజాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో ప్రతిపక్ష నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తన భద్రతపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి కొందరు ప్రయత్నిస్తున్నారని కొద్దిరోజుల క్రితం బహిరంగ సభలోనే పవన్ కల్యాణ్ చెప్పారు.
తనకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్ల పైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని వెనక్కు పంపించారు పవన్. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ తన భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆదివారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వరుసగా తన కాన్వాయ్‌లో జరుగుతున్న ప్రమాదాలను ప్రస్తావించారు.
ఈనెల 15న కాకినాడ ఉంచి రాజానగరంకు పవన్ కల్యాణ్ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ ని ఒక ఇసుక లారీ ఎదురుగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ కారుకు ఏమీ కాకపోయినా ఆయన భద్రతగా వచ్చిన బౌన్సర్లు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అదే రోజు రాత్రి నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి పవన్, నాదెండ్ల వేరువేరు కార్లలో వెళ్తున్న సమయంలో మరోసారి ఇసుక లారీ వచ్చి ఢీకొట్టింది. ఈసారి మనోహర్ కారు దెబ్బతింది. ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ఇలా వరుస పరిణామాలపై ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ చర్చించారు. తనపై దాడికి గతంలో కొందరు రావడం, వరుసగా ఇసుక లారీలే తన కాన్వాయ్‌ని టార్గెట్ చేస్తుండడంతో ఇవి యాదృచ్చికంగా జరుగుతున్నాయా లేక కుట్రపూరితమై ఉంటుందా అని పవన్ చర్చించారు.
ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపత్కర పరిస్థితులు ఎదురు కావొచ్చని…. వాటిని తట్టుకుని నిలబడేలా జాగ్రత్తగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.