Telugu Global
NEWS

ఈసారి బాబుకే టీ కాంగ్రెస్‌ వెన్నుపోట్లు

తెలంగాణలో అతికష్టం మీద మహాకూటమి ఆకారం అయితే దాల్చింది గానీ… లోలోపల కూటమి పార్టీలు కత్తులు కడుపులో పెట్టుకుని తిరుగుతున్నాయి. పొత్తు వల్ల అవకాశం కోల్పోయిన పార్టీల నేతలు టికెట్‌ దక్కిన అభ్యర్థులను ఓడగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. 2009లో టీఆర్‌ఎస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన చంద్రబాబు… ఆఖరి నిమిషంలో టీఆర్‌ఎస్‌కు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలకు విచ్చలవిడిగా బీఫాంలు ఇచ్చి టీఆర్‌ఎస్‌కు గట్టిగా పోట్లు పొడిచాడు. గతంలో చంద్రబాబు ఇలా పొత్తుపెట్టుకుని ఆఖరిలో పార్టీ నేతలకు బీఫాంలు […]

ఈసారి బాబుకే టీ కాంగ్రెస్‌ వెన్నుపోట్లు
X

తెలంగాణలో అతికష్టం మీద మహాకూటమి ఆకారం అయితే దాల్చింది గానీ… లోలోపల కూటమి పార్టీలు కత్తులు కడుపులో పెట్టుకుని తిరుగుతున్నాయి. పొత్తు వల్ల అవకాశం కోల్పోయిన పార్టీల నేతలు టికెట్‌ దక్కిన అభ్యర్థులను ఓడగొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

2009లో టీఆర్‌ఎస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసిన చంద్రబాబు… ఆఖరి నిమిషంలో టీఆర్‌ఎస్‌కు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలకు విచ్చలవిడిగా బీఫాంలు ఇచ్చి టీఆర్‌ఎస్‌కు గట్టిగా పోట్లు పొడిచాడు.

గతంలో చంద్రబాబు ఇలా పొత్తుపెట్టుకుని ఆఖరిలో పార్టీ నేతలకు బీఫాంలు ఇచ్చిన చరిత్ర ఘనంగానే ఉంది. అయితే ఈసారి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఆ పని చేయలేకపోయాడు గానీ… కాంగ్రెస్‌ చేసింది. మిత్రపక్షాలకు కేటాయించిన ఐదు స్థానాల్లో పార్టీ నేతలకు బీఫాం ఇచ్చింది.

పొత్తులో భాగంగా వరంగల్ ఈస్ట్‌, మిర్యాలగూడ, దుబ్బాక స్థానాలను టీజేఎస్‌కు కాంగ్రెస్ కేటాయించింది. అయితే ఆయా స్థానాల్లో టీజేఎస్‌ ప్రకటించిన అభ్యర్థులు బలహీనంగా ఉన్నారంటూ వరంగల్ తూర్పు నుంచి గాయత్రి రవి, మిర్యాలగూడ నుంచి ఆర్‌ కృష్ణయ్య, దుబ్బాకలో మద్దుల నాగేశ్వరరెడ్డికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి బీఫాం ఇచ్చారు.

అదే విధంగా టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు స్థానాలకు కాంగ్రెస్‌… ఇబ్రహీంపట్నంలో మల్‌ రెడ్డి రంగారెడ్డికి, పటాన్‌చెరులో కాట శ్రీనివాస్‌ గౌడ్‌కు బీఫాం ఇచ్చింది.

తమకు కేటాయించిన సీట్లలోనూ కాంగ్రెస్ తన అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వడంపై టీటీడీపీ అసంతృప్తిగా ఉన్నా… చంద్రబాబు ఆలోచన మేరకు మౌనంగా ఉన్నట్టు చెబుతున్నారు.

First Published:  19 Nov 2018 12:15 PM IST
Next Story