Telugu Global
NEWS

కరీంనగర్ కిరీటం ఎవరికి దక్కుతుందో..?

ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా కరీంనగర్. ప్రస్తుతం ఈ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయినా.. కరీంనగర్ నియోజకవర్గం పైనే అందరి దృష్గి ఉంది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటైన ఈ నియోజక వర్గం అధికంగా పట్టణ ప్రాంతమే. దీంతో పట్టణ ప్రజల సమస్యలే ఈ ఎన్నికను ప్రభావితం చేయనున్నాయి. కరీంనగర్ నియోజక వర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ గత రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ తరపున […]

కరీంనగర్ కిరీటం ఎవరికి దక్కుతుందో..?
X

ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా కరీంనగర్. ప్రస్తుతం ఈ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయినా.. కరీంనగర్ నియోజకవర్గం పైనే అందరి దృష్గి ఉంది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటైన ఈ నియోజక వర్గం అధికంగా పట్టణ ప్రాంతమే. దీంతో పట్టణ ప్రజల సమస్యలే ఈ ఎన్నికను ప్రభావితం చేయనున్నాయి.

కరీంనగర్ నియోజక వర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ గత రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ తరపున గెలిచి అసెంబ్లీలో ప్రవేశించారు. గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానం సాధించింది. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు ప్రభావం ఈ పట్టణంపై అధికంగా ఉండటమే కాక… బీజేపీ క్యాడర్ కూడా బలంగా ఉంది.

దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సీఎల్ లక్ష్మీ నరసింహారావు మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.

ఇక ఈ సారి కరీంనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తిరిగి పోటీ చేస్తుండగా…. బీజేపీ నుంచి బండి సంజయ్ నిలబడ్డారు. ఇక మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను నిలబెట్టింది.

కరీంనగర్ కార్పొరేషన్, లోక్‌సభ సీటు టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ వ్యక్తే. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండే కరీంనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులే గత కొన్ని సంవత్సరాలుగా గెలుస్తూ వచ్చారు. అయితే ఈ సారి పట్టణ ఓటర్లు మౌలిక సదుపాయాలపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా మిషన్ భగీరథ పూర్తి కాకపోవడం కూడా అధికార పార్టీకి మైనస్ గానే ఉంది.

ఇక మరోవైపు బీజేపీ పార్టీకి మోడీ చరిష్మ ఈ సారి పనిచేసేలా లేదు. కరీంనగర్‌పై రాష్ట్ర బీజేపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. బండి సంజయ్‌ను ఈ సారి ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన పొన్నం ఈ సారి ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఎంత మేర సహకరిస్తాయనే అనుమానాలు ఉన్నాయి.

గత కొన్ని ఎన్నికల నుంచి టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. మరి ఈ సారి మహాకూటమి అభ్యర్థి గెలవాలంటే కూటమి పార్టీలలో సఖ్యతతో పాటు కింది స్థాయిలో ఓట్లు అన్నీ కూటమికే పడాలి. మరోవైపు బీజేపీ అభ్యర్థి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడా చీల్చే అనుమానం ఉంది. ఏదేమైనా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వైపే కాస్త మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోంది.

First Published:  19 Nov 2018 6:39 AM GMT
Next Story