Telugu Global
NEWS

హద్దులు తెలియక.... కూకట్‌పల్లిలో టీడీపీ ప్రచారం నవ్వులపాలు....

కూకట్‌పల్లి నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి పేరును ప్రకటించి ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టిన తర్వాత అనూహ్యంగా చుండ్రు సుహాసిని పేరును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. పెద్దిరెడ్డిని వెనక్కు పిలిపించి హరికృష్ణ కుమార్తెకు సీటు కట్టబెట్టారు. అయితే అప్పటి వరకు ఏమాత్రం రాజకీయాలకు గానీ, నియోజవకర్గానికి గానీ పరిచయం లేని సుహాసిని ప్రచారంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుహాసినీని ఓడించి తీరుతామని ఇప్పటికే స్థానిక కాంగ్రెస్‌ నేతలంతా కలిసి శపథం చేశారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే […]

హద్దులు తెలియక.... కూకట్‌పల్లిలో టీడీపీ ప్రచారం నవ్వులపాలు....
X

కూకట్‌పల్లి నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి పేరును ప్రకటించి ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టిన తర్వాత అనూహ్యంగా చుండ్రు సుహాసిని పేరును చంద్రబాబు తెరపైకి తెచ్చారు.

పెద్దిరెడ్డిని వెనక్కు పిలిపించి హరికృష్ణ కుమార్తెకు సీటు కట్టబెట్టారు. అయితే అప్పటి వరకు ఏమాత్రం రాజకీయాలకు గానీ, నియోజవకర్గానికి గానీ పరిచయం లేని సుహాసిని ప్రచారంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సుహాసినీని ఓడించి తీరుతామని ఇప్పటికే స్థానిక కాంగ్రెస్‌ నేతలంతా కలిసి శపథం చేశారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రచారంలో నియోజకవర్గం హద్దులను కూడా సుహాసినీ, ఆమె బృందం గుర్తించలేకపోతోంది.

నియోజక వర్గానికి పూర్తిగా కొత్తకావడంతో కూకట్‌పల్లి నియోజకవర్గంలోనే కాకుండా పక్కనే ఉన్నశేర్‌లింగంపల్లి నియోజవకర్గంలోని డివిజన్లలో సుహాసినీ టీం ప్రచారం చేస్తోంది. ఈ పరిణామం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తెలిసిన వారు ఈ డివిజన్ కూకట్‌పల్లిలో లేదని వివరించగా సవరించుకుని తిరిగి కూకట్‌పల్లిలోకి వెళ్తున్నారు.

టీడీపీ అభ్యర్థి సుహాసినీ టీం శేర్‌లింగంపల్లిలో ప్రచారం చేయడం తాను కళ్లారా చూశానని ఆ నియోజక వర్గానికి టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న వాసుదేవ రెడ్డి చెప్పారు. మీడియా ముందు మాట్లాడడం కూడా రాని ఒక గృహిణిని తీసుకొచ్చి హఠాత్తుగా పోటీకి పెట్టి టీడీపీ నవ్వుల పాలవుతోందన్నారు.

నందమూరి కుటుంబాన్ని బలిపశువును చేసేందుకే చంద్రబాబు ఆమెను తెరపైకి తెచ్చారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సమాధి చేసే ఆలోచన కూడా చంద్రబాబులో ఉందన్నారు.

కూకట్‌పల్లి అభ్యర్థిగా సుహాసినిని చంద్రబాబు ప్రకటించడం వల్ల టీఆర్‌ఎస్‌కు మంచే జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్న సొమ్ములో 500 కోట్లను తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఖర్చు చేస్తున్నారన్నారు.

ఆ డబ్బుతోనే గెలుస్తామన్న నమ్మకం తప్ప టీడీపీలో మరొకటి లేదన్నారు వాసుదేవరెడ్డి. డబ్బుల కోసం టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు అమరావతిలో చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

First Published:  19 Nov 2018 4:24 AM IST
Next Story