హరికృష్ణ చనిపోతే సంభ్రమాశ్చర్యం ఏంటి? " బాలకృష్ణ తెలుగుపై రామకోటయ్య ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తును జనం అంగీకరించడం లేదని అభిప్రాయపడ్డారు బీజేపీ నేత రామకోటయ్య. తాము టీఆర్ఎస్ ఓడిపోతుందని భావించామని…. కానీ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల కేసీఆరే తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. కేసీఆర్‌కు మహాకూటమి ద్వారానే అనూహ్య విజయం దక్కబోతుందన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని… దాని ఫలితాన్ని అనుభవించబోతున్నారని వ్యాఖ్యానించారు. డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన జనం ఓట్లేస్తారుకోవడం అమాయకత్వమేనని అభిప్రాయపడ్డారు. మాట్లాడడం కూడా సరిగా […]
తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తును జనం అంగీకరించడం లేదని అభిప్రాయపడ్డారు బీజేపీ నేత రామకోటయ్య. తాము టీఆర్ఎస్ ఓడిపోతుందని భావించామని…. కానీ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల కేసీఆరే తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు.
కేసీఆర్‌కు మహాకూటమి ద్వారానే అనూహ్య విజయం దక్కబోతుందన్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని… దాని ఫలితాన్ని అనుభవించబోతున్నారని వ్యాఖ్యానించారు.
డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన జనం ఓట్లేస్తారుకోవడం అమాయకత్వమేనని అభిప్రాయపడ్డారు. మాట్లాడడం కూడా సరిగా రాని చుండ్రు సుహాసినిని కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించడంపై వస్తున్న విమర్శలకు రామకోటయ్య స్పందించారు.
ఒక గృహిణి అయిన సుహాసిని అలా మాట్లాడారని…. ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ స్పీచ్ ఇంకా దారుణంగా ఉందన్నారు. హరికృష్ణ చనిపోవడం తమకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రామకోటయ్య ప్రస్తావించారు. ముందు టీవీ చానళ్లు బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రసారం చేయాలని కోరారు.