శబరిమల వివాదం.... హైవేలను దిగ్బంధించిన బీజేపీ నేతలు
కేరళలో బీజేపీ నేడు ‘నిరసన రోజు’కు పిలుపునిచ్చింది. పోలీసుల సాయంతో మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లడానికి కేరళ ప్రభుత్వం పూనుకోవడంతో దీన్ని బీజేపీ శ్రేణులు, నిరసన కారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిరసన రోజుకు నాయకత్వం వహించిన ఓ బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఇప్పుడు శబరిమలలోకి మహిళలను తీసుకెళ్లాలన్ననిర్ణయంపై నిరసన కారులు భగ్గుమంటున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రహదారులను, స్టేట్ హైవేలను ఆదివారం దిగ్బంధించారు. శబరిమల నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని తిరువల్ల […]
కేరళలో బీజేపీ నేడు ‘నిరసన రోజు’కు పిలుపునిచ్చింది. పోలీసుల సాయంతో మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లడానికి కేరళ ప్రభుత్వం పూనుకోవడంతో దీన్ని బీజేపీ శ్రేణులు, నిరసన కారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిరసన రోజుకు నాయకత్వం వహించిన ఓ బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కేరళలో ఇప్పుడు శబరిమలలోకి మహిళలను తీసుకెళ్లాలన్ననిర్ణయంపై నిరసన కారులు భగ్గుమంటున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రహదారులను, స్టేట్ హైవేలను ఆదివారం దిగ్బంధించారు. శబరిమల నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని తిరువల్ల పట్టణ కేంద్రం లో దాదాపు 150మంది బీజేపీ కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు.
ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కేరళ బీజేపీ ప్రధాన కార్యదర్శి కే సురేంద్రన్ ను నిలక్కల్ బేస్ క్యాంప్ లోనే పోలీసులు నిర్బంధించారు. పోలీసులు సురేంద్రన్‌ను, పార్టీ కార్యకర్తలను అడ్డుకొని వారిని ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు. వారు మాత్రం తిరస్కరించి అక్కడే భైటాయించి ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు సురేంద్రన్ ను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు.
సురేంద్రన్ అరెస్ట్ కు వ్యతిరేకంగా హిందూ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కేపీ శశికళ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది.. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు తెలిపారు.
దాదాపు రెండు నెలల విరామం అనంతరం శబరిమల ఆలయం ఈనెల మూడో శుక్రవారం తెరిచారు. ఈసారి ఎలాగైనా మహిళలను ఆలయంలోకి ప్రవేశింప చేయాలని యోచిస్తున్న కేరళ ప్రభుత్వానికి నిరసనకారులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. దీంతో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.