Telugu Global
NEWS

ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కేసీఆర్ యాగాలు చేస్తున్నారా?

తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం కేసీఆర్ యాగాలు చేస్తున్నారా? ఫామ్‌హౌస్‌లో రెండు రోజుల పాటు యాగాలు చేయ‌బోతున్నారా? ఈ రెండు రోజులు కేసీఆర్ బ‌య‌ట‌కు క‌నిపించ‌రా? అంటే అవుననే స‌మాధానం విన్పిస్తోంది. ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ రెండు యాగాలు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముందు కేసీఆర్ యాగాలు చేస్తుండడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ యాగాలు ఇప్పుడు ఎందుకు చేయ‌బోతున్నారనేది కూడా ఆస‌క్తిక‌రంగా త‌యారైంది. ఆదివారం ఒక యాగం. సోమ‌వారం ఒక యాగం కేసీఆర్ నిర్వహిస్తున్న‌ట్లు తెలుస్తోంది. […]

ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కేసీఆర్ యాగాలు చేస్తున్నారా?
X

తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం కేసీఆర్ యాగాలు చేస్తున్నారా? ఫామ్‌హౌస్‌లో రెండు రోజుల పాటు యాగాలు చేయ‌బోతున్నారా? ఈ రెండు రోజులు కేసీఆర్ బ‌య‌ట‌కు క‌నిపించ‌రా? అంటే అవుననే స‌మాధానం విన్పిస్తోంది.

ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ రెండు యాగాలు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముందు కేసీఆర్ యాగాలు చేస్తుండడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ యాగాలు ఇప్పుడు ఎందుకు చేయ‌బోతున్నారనేది కూడా ఆస‌క్తిక‌రంగా త‌యారైంది.

ఆదివారం ఒక యాగం. సోమ‌వారం ఒక యాగం కేసీఆర్ నిర్వహిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆదివారం రాజ శ్యామల చండి యాగం నిర్వ‌హిస్తున్నారని విశ్వ‌సనీయ వ‌ర్గాలు అంటున్నాయి. సోమ‌వారం చండి సహిత రుద్ర యాగం నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. సోమ‌వారం ఉద‌యం 11 గంటల లోపు యాగం పూర్తి చేసేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది.

ఈ యాగం పూర్తైన త‌ర్వాత కేసీఆర్ ప్ర‌చారానికి బ‌య‌లుదేరుతార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నిర్వ‌హించే యాగం కోసం 120 మంది పూజారులు ఇప్ప‌టికే ఫాంహౌస్ చేరుకున్నార‌ని తెలుస్తోంది. ఈ యాగంలో కేసీఆర్ కుటుంబానికి చెందిన‌వారు మొత్తం పాల్గొంటార‌ని స‌మాచారం. ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్ ప‌రిస‌రాల్లోకి ఇత‌రులు ఎవ‌రూ రాకుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

First Published:  18 Nov 2018 3:12 AM IST
Next Story