Telugu Global
National

రహస్యాలున్న వారే సీబీఐని నిషేధించారు " జైట్లీ

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. భయంతోనే చంద్రబాబు ఈ పని చేశారని వ్యాఖ్యానించారు. వెల్లడించలేని రహస్యాలు ఉన్న వారే సీబీఐ అంటే భయపడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలానా కేసుకు సంబంధించినదిగా చెప్పలేమని… కానీ భవిష్యత్తులో సీబీఐ వస్తుందన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థలో భాగంగానే రాష్ట్రాల్లో సీబీఐ పనిచేస్తుందని చెప్పారు. […]

రహస్యాలున్న వారే సీబీఐని నిషేధించారు  జైట్లీ
X

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు.

భయంతోనే చంద్రబాబు ఈ పని చేశారని వ్యాఖ్యానించారు. వెల్లడించలేని రహస్యాలు ఉన్న వారే సీబీఐ అంటే భయపడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలానా కేసుకు సంబంధించినదిగా చెప్పలేమని… కానీ భవిష్యత్తులో సీబీఐ వస్తుందన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

సమాఖ్య వ్యవస్థలో భాగంగానే రాష్ట్రాల్లో సీబీఐ పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రాలు, కోర్టులు అప్పగించిన తీవ్రమైన కేసులను సీబీఐ విచారిస్తుందన్నారు. అటు బెంగాల్‌లో సీబీఐపై వేటు వేయడాన్ని కూడా జైట్లీ తప్పుపట్టారు.

సీబీఐని అడ్డుకున్నంత మాత్రాన బెంగాల్లో నర్మద, శారదా చిట్ ఫండ్‌ స్కాంలపై దర్యాప్తు ముగిసినట్టే అనుకోవద్దన్నారు.

First Published:  18 Nov 2018 3:14 AM IST
Next Story