రాహువు
రాహుకేతువుల పేర్లు మీరెప్పుడైనా విన్నారా? ఎప్పుడోకప్పుడు అమ్మమ్మ నోటో నాయినమ్మనోటో వినే వుంటారులే. గుర్తు కొచ్చిందా ఏదైనా పనికి అడ్డం పడేవాళ్ళను, నష్టపరిచి కష్టాలకు గురిచేసే వాళ్ళను అలా అని ఇళ్ళలో ఇప్పటికీ అంటూవుంటారు. తెలుసుగా, సూర్య చంద్రుల్ని రాహుకేతువులు మింగబోయి వల్లకాక కక్కేసారని బోలెడంత కథ మీరు వినేవుంటారు. మన సైన్సు పాఠాల్లోనూ గ్రహణాలు ఏర్పడకుండా వాటి వెనుకో కథ వుంటుంది. అది పురాణ కథ. అలాంటి పురాణ కథల్లోకి వెళ్తే- రాహువు ఒక దానవుడు. […]
రాహుకేతువుల పేర్లు మీరెప్పుడైనా విన్నారా? ఎప్పుడోకప్పుడు అమ్మమ్మ నోటో నాయినమ్మనోటో వినే వుంటారులే. గుర్తు కొచ్చిందా ఏదైనా పనికి అడ్డం పడేవాళ్ళను, నష్టపరిచి కష్టాలకు గురిచేసే వాళ్ళను అలా అని ఇళ్ళలో ఇప్పటికీ అంటూవుంటారు.
తెలుసుగా, సూర్య చంద్రుల్ని రాహుకేతువులు మింగబోయి వల్లకాక కక్కేసారని బోలెడంత కథ మీరు వినేవుంటారు. మన సైన్సు పాఠాల్లోనూ గ్రహణాలు ఏర్పడకుండా వాటి వెనుకో కథ వుంటుంది. అది పురాణ కథ. అలాంటి పురాణ కథల్లోకి వెళ్తే-
రాహువు ఒక దానవుడు. సింహక పుత్రుడు. మందర పర్వతానికి సర్పాన్ని చుట్టి సముద్రాన్ని మధించినప్పుడు అమృతం పుట్టింది. అప్పుడు దేవతలూ రాక్షసులూ చెరోపక్క వున్నారట. విష్ణుమూర్తి జగన్మోహిని రూపమెత్తి అమృతము అందరికీ పంచుతున్నాడట. ముందుగా దేవతల వరుసకు అమృతము పోస్తున్నాడట. ఆ అమృతము తమ వరకు రాదని గ్రహించిన రాహువు దేవతల బంతిలో చేరి అమృతము తాగుతూ ఉన్నాడట. రాహువుని కనిపెట్టిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పేరట. విష్ణుమూర్తి తన చక్రంతో రాహువుని కొట్టాడట. రాహువు తల తెగి పడిందట. కాని అమృతం తాగడం వల్ల నాశనం కాలేదట.
అందుకనే సూర్యచంద్రుల పట్ల వైరము పెంచుకున్న రాహుకేతువులు అప్పుడప్పుడూ అప్పుడప్పుడూ మింగుతూ వుంటారని- అందువల్లనే సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయని పెద్దలు చెపుతారు. అన్నట్టు మేఘహాసుడు ఎవరో తెలుసా?, రాహువు కుమారుడే!
– బమ్మిడి జగదీశ్వరరావు