Telugu Global
NEWS

మెడ్‌టెక్‌ మేత స్కాం.... లగడపాటిపై సీబీఐ దాడులు....?

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగుపెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించడం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఏపీలోని ప్రైవేట్ వ్యక్తులపై కూడా సీబీఐ దాడులు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా చంద్రబాబు ఎందుకు చేశారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం, ఐటీ భూములు, అమరావతి భూములు, జగన్‌పై హత్యాయత్నం వంటి కేసుల్లో సీబీఐ విచారణ జరిగితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా చేశారని చెబుతున్నారు. అయితే మరో కీలక మైన కుంభకోణం వ్యవహారం […]

మెడ్‌టెక్‌ మేత స్కాం.... లగడపాటిపై సీబీఐ దాడులు....?
X

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగుపెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించడం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఏపీలోని ప్రైవేట్ వ్యక్తులపై కూడా సీబీఐ దాడులు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా చంద్రబాబు ఎందుకు చేశారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలవరం, ఐటీ భూములు, అమరావతి భూములు, జగన్‌పై హత్యాయత్నం వంటి కేసుల్లో సీబీఐ విచారణ జరిగితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా చేశారని చెబుతున్నారు. అయితే మరో కీలక మైన కుంభకోణం వ్యవహారం కూడా బయటకు వచ్చింది. కొద్ది రోజుల్లోనే సీబీఐ ఏపీకి రాబోతోందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి రఘనాథ్‌ బాబు వెల్లడించారు.

లగడపాటికి చెందిన ల్యాంకో, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మెడ్‌టెక్ సంస్థ సీఈవో జితేంద్ర శర్మ, గతంలో ఆరోగ్యశాఖలో చక్రం తిప్పిన పెద్దలు కలిసి చేసిన భారీ కుంభకోణాల విషయంలో సీబీఐ దర్యాప్తు చేసేందుకు రాబోతోందని సంచలన విషయం చెప్పారు. లగడపాటి కంపెనీలపై సీబీఐ దాడికి దిగుతోందని… అందు కోసమే చంద్రబాబు సీబీఐ ఏపీలోకి రాకుండా నిషేధించారని రఘునాథ బాబు టీవీ చర్చలో వెల్లడించారు.

నిజానికి మెడ్‌టెక్‌ కుంభకోణం బరితెగించి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో స్టీల్‌ ప్లాంట్ ఎదురుగా ఉన్న 270 ఎకరాల్లో ఏపీ మెడ్‌ టెక్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఇందులో వైద్య రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తారు.

ఈ భూమిలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో నడిపిన వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్నది ఆరోపణ. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 500 కోట్లకు ఆన్‌లైన్‌లో కాకుండా సాధారణంగానే టెండర్లు పిలిచారు. ఈ టెండర్లో ఎల్‌ వన్‌గా లాంకో సంస్థ నిలిచింది. ఆ సంస్థకే టెండర్లు కట్టబెడుతూ ఏపీ మెడ్‌ టెక్‌ సీఈవో, ప్రభుత్వ సలహాదారు జితేంద్ర శర్మ ఓకే చేశారు.

కాకపోతే కళ్లు బైర్లు కమ్మే అంశం ఏమిటంటే… ప్రభుత్వం పిలిచే టెండర్లలో ఐదు శాతం వరకు ఎక్సెస్‌ను అంగీకరిస్తారు. కొన్నిసార్లు మరికొంత వెసులుబాటు ఉంటుంది. కానీ మెడ్‌టెక్ లో మౌలిక సదుపాయాల కల్పనకు 500 కోట్లకు టెండర్ పిలువగా ఏకంగా 387 శాతం ఎక్సెస్‌తో టెండర్‌ కట్టబెట్టారు. దాంతో 500 కోట్లు అనుకున్న ప్రాజెక్ట్‌ ను ఏకంగా 1900 కోట్లకు కట్టబెట్టి బరితెగించి కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ అరాచకం చూడలేక కొందరు మెడ్‌టెక్ ఉద్యోగులే ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవడం అటుంచి అలా ఫిర్యాదు చేసిన వారిని ఉద్యోగాల నుంచి ఊడబీకి పంపించారు.

500 కోట్ల పనికి 387 శాతం ఎక్సెస్‌లో 1900 కోట్లకు పనులు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం జరిగిందన్నది చిన్న స్థాయి ఉద్యోగులు కూడా చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మెడ్‌టెక్‌ కుంభకోణాన్ని తేల్చేందుకు సీబీఐ రాబోతోందని బీజేపీ అధికార ప్రతినిధి చెప్పడం కొత్త పరిణామంగా భావిస్తున్నారు.

First Published:  17 Nov 2018 5:05 AM IST
Next Story