Telugu Global
NEWS

కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ బహిరంగ లేఖ

( పింగళి దశరథ రామ్ తో కలిసి ”ఎన్ కౌంటర్” పత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించిన జలదంకి ప్రభాకర్ (ప్రజ) అనేక పత్రికలకు రిపోర్టర్ గా పనిచేశారు. అగ్రిగోల్డ్ సంస్థ నడిపిన ”నది” పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసి దానిని తన ఫేస్ బుక్ లో పోస్టుచేశారు. ఆ పోస్టును యధాతదంగా ”తెలుగుగ్లోబల్.కామ్” పాఠకులకోసం అందజేస్తున్నాము.) మహారాజశ్రీ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ […]

కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ బహిరంగ లేఖ
X

( పింగళి దశరథ రామ్ తో కలిసి ”ఎన్ కౌంటర్” పత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించిన జలదంకి ప్రభాకర్ (ప్రజ) అనేక పత్రికలకు రిపోర్టర్ గా పనిచేశారు. అగ్రిగోల్డ్ సంస్థ నడిపిన ”నది” పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసి దానిని తన ఫేస్ బుక్ లో పోస్టుచేశారు. ఆ పోస్టును యధాతదంగా ”తెలుగుగ్లోబల్.కామ్” పాఠకులకోసం అందజేస్తున్నాము.)

మహారాజశ్రీ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దివ్య సముఖమునకు

ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న సీనియర్ జర్నలిస్టు జలదంకి ప్రభాకర్ వ్రాసుకొను విన్నపము.

అయ్యా, నేను ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి ఒక బానిసగా జీవితం గడుపుతున్నాను. మా రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయం భయం. భూదోపిడి, ఇసుక దోపిడి , ప్రభుత్వ పథకాలు దోపిడీ , ఒక వైపు అధికారుల విచ్చలవిడి దోపిడీ, మరోవైపు పాలకుల దోపిడీ. ప్రశ్నించే వారి మీద భౌతిక దాడులు.

రాష్ట్ర విజిలెన్స్ అధికారులకే దేహశుద్ది జరిగిందంటే – పాలకుల రౌడీయిజం ఎంత విశృంఖల వీరవిహారం చేస్తుందో ననడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే సార్ . ప్రజల దేవాలయం వంటి అసెంబ్లీ లోకి పోవడానికి భయపడి – బహిష్కరణ పేరుతో ప్రతిపక్షం బయట తిరుగుతుందంటే ఇక్కడ పరిస్థితి అంచనా వేయండి .

ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే కోడి కత్తి డ్రామా అని కొట్టిపారేశారు సార్. ఇక్కడ అధికారులకు, నాయకులకు రక్షణ లేని పరిస్థితిలో – నాలాంటి సామానుడైన జర్నలిస్టు నిజాలు రాస్తే ఏమైపోతుందో ప్రత్యేకించాల్సినపని లేదనుకుంటాను సార్ . నేను సొంతంగా పక్షపత్రిక పెట్టాలని గత 4 క్రితం ” ప్రభాకర్ ఎన్ కౌంటర్ ” టైటిల్ ఢిల్లీ నుండి తెచ్చి కొనికూడా నిర్వహించ కుండా మూలనపడేసాను.

ఇక్కడ స్వేచ్ఛ Every where it is in chains . నాయకులకు భయం , అధికారులకు భయం , ప్రజలకు భయం . ఎక్కడ చూసినా భయం భయం . ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తుండ బట్టే నేను ఈ వాతావరణం లో పత్రిక నిర్వహణ అసాధ్యమని ప్రక్కన పెట్టేసాను సార్ . తెలంగాణ లో ఆంధ్రులు మీ పాలనలో హాయిగా ఉన్నారని విన్నాను.

అక్కడ ఉన్న నా స్వంత తమ్ముడు , పాతమిత్రులు మీ పాలన గురించి మంచిగా చెబితే విన్నాను. అందుకే అభ్యర్ధిస్తున్నా సార్ నేను మీ రాష్ట్రం వచేస్తా. భయంభయంగా జీవించే స్థితి లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను వదిలేస్తా. అక్కడ స్వేచ్ఛగా మీ రాబోయే పాలనలో జీవిస్తా సార్. మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్న…

మీ అభిమాని
ప్రభాకర్ జలదంకి (ప్రజ) ,
సీనియర్ జర్నలిస్టు.

First Published:  17 Nov 2018 1:37 PM IST
Next Story