Telugu Global
NEWS

నందమూరి సుహాసిని.... గెలుపు కష్టమేనా?

అవును అది కూకట్ పల్లే. సెటిలర్ల జనాభా గట్టిగా ఉన్నదే. కమ్మోళ్ల జనాభాతో పాటు…. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లి సెటిలైన వివిధ కులాల వాళ్లు అక్కడ చాలా మందే ఉన్నారు. వారే ఎన్నికల ఫలితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు కూడా. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ ఆ సీట్లో విజయం సాధించగలిగింది. రేపు కూడా ఇదే జరుగుతుంది అని చాలా మంది అంటున్నారు. అందునా…. అక్కడ ఇప్పుడు హరికృష్ణ కూతురును బరిలోకి దింపుతున్నాడు చంద్రబాబు […]

నందమూరి సుహాసిని.... గెలుపు కష్టమేనా?
X

అవును అది కూకట్ పల్లే. సెటిలర్ల జనాభా గట్టిగా ఉన్నదే. కమ్మోళ్ల జనాభాతో పాటు…. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లి సెటిలైన వివిధ కులాల వాళ్లు అక్కడ చాలా మందే ఉన్నారు. వారే ఎన్నికల ఫలితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు కూడా. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ ఆ సీట్లో విజయం సాధించగలిగింది. రేపు కూడా ఇదే జరుగుతుంది అని చాలా మంది అంటున్నారు.

అందునా…. అక్కడ ఇప్పుడు హరికృష్ణ కూతురును బరిలోకి దింపుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది సెటిలర్ల ఓట్లను గంపగుత్తగా పడేలా చేస్తుందని.. టీడీపీకి అడ్వాంటేజీ అవుతుందని కామన్ గా వినిపించే అభిప్రాయం. ఇక హరి ఇటీవలే మరణించారు కాబట్టి.. ఆ సానుభూతిని కూడా టీడీపీ వాడుకోవచ్చు అని అంటున్నారు. హరి ఫొటోలతోనే సుహాసిని ప్రచారం చేయవచ్చు.

ఇవన్నీ అడ్వాంటేజీలే కానీ… ఆ ప్రభావాలన్నీ అక్కడ ఒక కులం ఓటర్ల మీద మాత్రమే.

కూకట్ పల్లిలో టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు. సుహాసినికి అక్కడ విజయం నల్లేరు మీద నడక కాదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఆమెకు అనుకూలాంశాలు ఉన్నట్టే ఈ సారి కొన్ని టీడీపీ నెగిటివ్ పాయింట్లు ఉన్నాయని అంటున్నారు. గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ స్థాయిలో టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున తరలిపోయింది. ఎమ్మెల్యేతో సహా చాలా మంది తెరాస వైపు వెళ్లిపోయారు. తెరాసకు కూడా ఎంతో కొంత నియోజకవర్గంలో పట్టుంది. వెలమల జనాభా ఉంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి సహకరించేది లేదని అంటోంది.

వీటన్నిటికన్నా ముఖ్యంగా సెటిలర్‌ లు అంటే ఒక సామాజిక వర్గమే కాదు, అనేక సామాజిక వర్గాల వాళ్ళు అక్కడ ఉన్నారు. చంద్రబాబును వ్యతిరేకించే, టీడీపీని వ్యతిరేకించే, జగన్‌ ను అభిమానించే, కేసీఆర్‌ ను అభిమానించే సెటిలర్లు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళంతా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు. సెటిలర్లు టీడీపీకి ఎంత ప్లస్‌ పాయింటో, అంతే మైనస్‌ పాయింట్‌ కూడా.

ఈ సీటును ఆశించిన కాంగ్రెస్ వాళ్లు తాము ఇక్కడ రెబల్ గా బరిలోకి దిగుతామని అంటున్నారు. ఈ పరిణామాల మధ్యన కూకట్ పల్లిలో హరి తనయకు విజయం సులభం కాదనే మాట వినిపిస్తోంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు అని, అయినా ఆయన ఆమెను బరిలోకి దింపుతున్నాడని అంటున్నారు. నందమూరి కుటుంబానికి చెక్ పెట్టే ప్రయత్నమే ఇదంతా అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

First Published:  16 Nov 2018 8:54 PM GMT
Next Story