Telugu Global
International

టీ-20ల్లో మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు

రోహిత్ శర్మ, కొహ్లీలను అధిగమించిన మిథాలీ టీ-20 ప్రపంచకప్ లో మిథాలీ హాఫ్ సెంచరీల జోరు భారత ఎవర్ గ్రీన్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను అధిగమించి… టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది. మిథాలీ హాఫ్ సెంచరీల షో కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ […]

టీ-20ల్లో మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు
X
  • రోహిత్ శర్మ, కొహ్లీలను అధిగమించిన మిథాలీ
  • టీ-20 ప్రపంచకప్ లో మిథాలీ హాఫ్ సెంచరీల జోరు

భారత ఎవర్ గ్రీన్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను అధిగమించి… టీ-20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచింది.

మిథాలీ హాఫ్ సెంచరీల షో

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2018 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్-బీ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడురౌండ్ల మ్యాచ్ ల్లో మిథాలీ రెండు హాఫ్ సెంచరీలతో… అత్యధిక పరుగుల రికార్డు సాధించింది.

రోహిత్, విరాట్ లను అధిగమించిన మిథాలీ

గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఐర్లాండ్ తో ముగిసిన మూడోరౌండ్ పోటీలో 35 ఏళ్ల మిథాలీ 56 బాల్స్ లో 51 పరుగులు సాధించింది. మిథాలీ మొత్తం 2వేల 283 పరుగులు సాధించి… 2వేల 207 పరుగుల రోహిత్ శర్మ, 2వేల 102 పరుగుల విరాట్ కొహ్లీ ల రికార్డును అధిగమించింది.

భారత టీ-20 క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో..అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా మిథాలీ నిలిచింది.

గప్టిల్, బేట్స్ టాప్….

టీ-20 ఫార్మాట్ పురుషుల విభాగంలో అత్యధిక పరుగుల రికార్డు…న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరుతో ఉంది. గప్టిల్ 2వేల 271 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.

మహిళా టీ-20ల్లో న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ సుజీ బేట్స్ 2వేల 996 పరుగులతో అగ్రస్థానంలో నిలిచింది.

నాలుగోస్థానంలో మిథాలీ రాజ్

అత్యధిక టీ-20 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్…నాలుగోస్థానం సంపాదించింది. ఐర్లాండ్ తో ముగిసిన మూడో రౌండ్ వరకూ…85 మ్యాచ్ లు ఆడిన మిథాలీ..80 ఇన్నింగ్స్ లో 17 హాఫ్ సెంచరీలు సాధించింది. 97 పరుగుల నాటౌట్ స్కోరుతో 37.42 సగటు నమోదు చేసింది.

First Published:  17 Nov 2018 5:30 AM IST
Next Story