Telugu Global
NEWS

జానారెడ్డి ప్లాన్ బి వ‌ర్క్‌వుట్ అవుతుందా?

కాంగ్రెస్ లో టికెట్ల కోసం చివ‌రి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ఓవైపు నామినేష‌న్ల ప్ర‌క్రియ సాగుతోంది. దీంతో చివ‌రి నిమిషంలో టికెట్లు సాధించేందుకు నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మిర్యాల‌గూడ సీటు త‌న కొడుకు లేదా త‌న వ‌ర్గానికి తీసుకొచ్చేందుకు జానారెడ్డి కొత్త స్కెచ్‌లు గీస్తున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితికి పొత్తులో భాగంగా 8 సీట్లు ఇచ్చారు. వీటిలో న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ ఉంది‌. అయితే ఇక్క‌డి నుంచి జానారెడ్డి కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. పొత్తులో టీజేఎస్‌కి ఈసీటు […]

జానారెడ్డి ప్లాన్ బి వ‌ర్క్‌వుట్ అవుతుందా?
X

కాంగ్రెస్ లో టికెట్ల కోసం చివ‌రి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ఓవైపు నామినేష‌న్ల ప్ర‌క్రియ సాగుతోంది. దీంతో చివ‌రి నిమిషంలో టికెట్లు సాధించేందుకు నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మిర్యాల‌గూడ సీటు త‌న కొడుకు లేదా త‌న వ‌ర్గానికి తీసుకొచ్చేందుకు జానారెడ్డి కొత్త స్కెచ్‌లు గీస్తున్నారు.

తెలంగాణ జ‌న‌స‌మితికి పొత్తులో భాగంగా 8 సీట్లు ఇచ్చారు. వీటిలో న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ ఉంది‌. అయితే ఇక్క‌డి నుంచి జానారెడ్డి కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. పొత్తులో టీజేఎస్‌కి ఈసీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేత‌లు రెడీగా లేరు. ముఖ్యంగా జానారెడ్డి అయితే మాత్రం అస్సలు ఒప్పుకోవ‌డం లేదు.

మిర్యాలగూడ‌లో జానాకు మంచి పట్టుంది. దీంతో త‌న కొడుకుకు ఈ సీటు ఇవ్వాల‌ని మొద‌టి నుంచి అడుగుతున్నారు. త‌న‌కు నాగార్జున‌సాగ‌ర్‌, కొడుకుకు మిర్యాల‌గూడ ఇవ్వాల‌ని ఢిల్లీ లెవ‌ల్లో పైర‌వీలు చేశారు. హ‌స్తిన‌కు వెళ్లినా ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో జానారెడ్డి ప్లాన్ బి బయటకు తీశారు. అదేమంటే? మిర్యాలగూడ సీటు కూటమిలో భాగంగా తెలంగాణ జన సమితికి ఖరారైంది.

కానీ ఆ సీటులో తెలంగాణ జన సమితి చెబుతున్న అభ్యర్థి కాకుండా తాను సూచించిన అభ్యర్థిని నిలబెట్టాలంటూ జానారెడ్డి కోదండరాం పై వత్తిడి తెస్తున్నట్లు జన సమితి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలా అయితేనే మిర్యాలగూడ సీటును గెలిపించేదుకు తాను పూచీ తీసుకుంటానని ఆయన అంటున్నట్లు వార్తలొస్తున్నాయి. లేకపోతే తనకు సంబంధం లేదని చెబుతున్నట్లు కూడా అంటున్నారు.

అయితే మిర్యాలగూడ సీటులో జన సమితి నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ కావాలని కోదండరాం పట్టుపడుతున్నారు. ఆ సీటు కోసం కోదడరాం సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారు. విద్యాధర్ రెడ్డి జెఎసి లో కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా జన సమితిలోనే తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి ఇన్ సైడ్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తన కొడుకుకు లేదంటే తన వియ్యంకుడి సోదరుడికి కూటమి టికెట్ ఇప్పించుకోవాలన్న ప్రయత్నాల్లో జానారెడ్డి బిజీగా ఉన్నారు.

First Published:  17 Nov 2018 2:38 AM IST
Next Story