కేసీఆర్ మంత్రాంగం.... ఎమ్మెల్సీ సీటు హామీ!
ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును ఆశించింది విజయా రెడ్డి. పీజేఆర్ తనయకు మొదటి నుంచి ఈ సీటు విషయంలో చాలా ఆశలున్నాయి. ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లోనే ఖైరతాబాద్ టికెట్ ను అడిగింది. అప్పట్లో పీజేఆర్ తనయుడికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. విష్ణుకు జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. అయితే విజయా రెడ్డికి మాత్రం ఛాన్స్ దక్కలేదు అప్పట్లో. దీంతో ఆమె రెబల్ గా నామినేషన్ వేసింది. కానీ సాధించింది ఏమీ లేదు. ఖైరతాబాద్ నుంచి అప్పట్లో దానం […]
ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును ఆశించింది విజయా రెడ్డి. పీజేఆర్ తనయకు మొదటి నుంచి ఈ సీటు విషయంలో చాలా ఆశలున్నాయి. ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లోనే ఖైరతాబాద్ టికెట్ ను అడిగింది. అప్పట్లో పీజేఆర్ తనయుడికి కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. విష్ణుకు జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. అయితే విజయా రెడ్డికి మాత్రం ఛాన్స్ దక్కలేదు అప్పట్లో. దీంతో ఆమె రెబల్ గా నామినేషన్ వేసింది. కానీ సాధించింది ఏమీ లేదు.
ఖైరతాబాద్ నుంచి అప్పట్లో దానం నాగేందర్ విజయం సాధించాడు. అనంతరం విజయా రెడ్డి కొంతకాలం రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించలేదు. ఆ తర్వాత వైసీపీలో ఈమె యాక్టివ్ అయ్యారు. ఆ పార్టీ నుంచి కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ.. జగన్ సమైక్యవాదం వైపు వెళ్లిపోవడంతో ఈమెకు అవకాశం లేకపోయింది.
కొంతకాలం కిందట తెరాసలో చేరి.. మళ్లీ ఖైరతాబాద్ సీటు మీదే ఈమె కన్నేసింది. అయితే ఆఖరి నిమిషంలో దానం నాగేందర్ నుంచి ఇబ్బంది మొదలైంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన దానం మళ్లీ ఆ సీటు మీద కర్చిఫ్ వేశాడు. అతడికే ఆ సీటు ఖరారు అయ్యింది.
ఈ నేపథ్యంలో విజయా రెడ్డికి మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే ఈ సారి మాత్రం కేసీఆర్ మరో హామీ ఇచ్చాడట. ఈమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడట. ఇప్పుడు దానం విజయం కోసం పనిచేయాలని…. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి…. అప్పుడు ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ విజయారెడ్డికి హామీ ఇచ్చాడట. దీంతో ఈమె దానం విజయం కోసం పనిచేస్తానని ప్రకటించింది. దానం ఆమెను కలిసి మద్దతు అడిగారు. అందుకు ఆమె ఆమోదం తెలిపింది.