సినిమాల్లో నటించకూడదనుకున్నా...
టాక్సీ వాలా” రిలీజ్ కి ముందే పైరసీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో విజయ్ దేవరకొండకి అలాగే మూవీ యూనిట్ ఇండస్ట్రీ లో మొత్తం సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగాక విజయ్ దేవరకొండ సినిమాలు మానేద్దాం అని డిసైడ్ అయ్యాడట. విజయ్ దేవరకొండ దీని గురించి మాట్లాడుతూ ” ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ సుజిత్ నారంగ్ మెడనొప్పిని సైతం లెక్కచేయకుండా వర్క్ చేశాడు. సంగీత దర్శకుడు జెక్స్ బిజోయ్ తన తండ్రికి […]
టాక్సీ వాలా” రిలీజ్ కి ముందే పైరసీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో విజయ్ దేవరకొండకి అలాగే మూవీ యూనిట్ ఇండస్ట్రీ లో మొత్తం సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగాక విజయ్ దేవరకొండ సినిమాలు మానేద్దాం అని డిసైడ్ అయ్యాడట.
విజయ్ దేవరకొండ దీని గురించి మాట్లాడుతూ ” ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ సుజిత్ నారంగ్ మెడనొప్పిని సైతం లెక్కచేయకుండా వర్క్ చేశాడు. సంగీత దర్శకుడు జెక్స్ బిజోయ్ తన తండ్రికి కాన్సర్ అనే చేదు నిజన్ని తట్టుకొని పనిచేశాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా అమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అమ్మని సరిగ్గా చూసుకోలేకపోయా. అమ్మ దగ్గర ఉండలేకపోవడం ఎంతో బాధనిపించింది.
దాంతో ఇకపై ఇటువంటి పరిస్థితిలు రాకూడదని భావించి, సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అడ్వాన్సులు ఇచ్చినా దర్శకనిర్మాతలు ఫోన్ చేసి చెప్పేశాను కూడా. అప్పటికే సినిమా పైరసీ అయ్యింది అంటే అప్పుడు మా బాధ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. దయ చేసి ఈ సినిమాని అందరూ ధియేటర్ లోనే చుడండి” అంటూ ప్రేక్షకులని కోరుకున్నాడు విజయ్ దేవరకొండ.