Telugu Global
Cinema & Entertainment

"అమర్ అక్బర్ ఆంటొని" సినిమా రివ్యూ

రివ్యూ: అమర్ అక్బర్ ఆంటొని రేటింగ్‌: 1.5/5 తారాగణం: రవితేజ, ఇలియానా, ఆదిత్య మీనన్, షియాజి షిండే తదితరులు సంగీతం:  ఎస్. తమన్ నిర్మాత:  మైత్రి మూవీ మేకర్స్ దర్శకత్వం:  శీను వైట్ల గత నాలుగేళ్ళలో ఒకే ఒక్క హిట్టుతో ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా కొత్త మూవీ అమర్ అక్బర్ ఆంటొని ఈ రోజు విడుదలైంది. అంచనాలు భారీగా లేకపోయినా ముందు నుంచి దర్శకుడు శీనువైట్ల మొదలుకుని హీరో దాకా యూనిట్ మొత్తం పాజిటివ్ గా ప్రచారం చేయటంతో అభిమానుల్లో ఆశలు రేగాయి. అమర్ (రవితేజ),ఐశ్వర్య […]

అమర్ అక్బర్ ఆంటొని సినిమా రివ్యూ
X

రివ్యూ: అమర్ అక్బర్ ఆంటొని
రేటింగ్‌: 1.5/5
తారాగణం: రవితేజ, ఇలియానా, ఆదిత్య మీనన్, షియాజి షిండే తదితరులు
సంగీతం: ఎస్. తమన్
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్
దర్శకత్వం: శీను వైట్ల

గత నాలుగేళ్ళలో ఒకే ఒక్క హిట్టుతో ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా కొత్త మూవీ అమర్ అక్బర్ ఆంటొని ఈ రోజు విడుదలైంది. అంచనాలు భారీగా లేకపోయినా ముందు నుంచి దర్శకుడు శీనువైట్ల మొదలుకుని హీరో దాకా యూనిట్ మొత్తం పాజిటివ్ గా ప్రచారం చేయటంతో అభిమానుల్లో ఆశలు రేగాయి.

అమర్ (రవితేజ),ఐశ్వర్య (ఇలియానా) ఫ్యామిలీస్ వ్యాపారంతో పాటు వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు. సిబు మీనన్ (ఆదిత్య మీనన్) బ్యాచ్ ప్లాన్ చేసి అందరిని చంపేస్తారు. కానీ జలాల్ (షియాజి షిండే)సహాయంతో అమర్, ఐశ్వర్య తప్పించుకుంటారు. పెద్దయ్యే వరకు జైల్లో ఉన్న అమర్ బయటికి వచ్చాక రివెంజ్ కు రెడీ అవుతాడు. అందులో భాగంగానే అక్బర్, ఆంటోనీలుగా మారాల్సి వస్తుంది. మరి ఈ ప్రతీకార చర్య ఎక్కడిదాకా వెళ్ళింది అనేదే బ్యాలెన్స్ కథ.

రవితేజ తన ఎనర్జీతో ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు. పర్సనాలిటీ డిజార్డర్ అనే పాయింట్ కొత్తదే కానీ అందులో షేడ్స్ రవితేజ గతంలో చేసినవే కాబట్టి అందులో ఏ మాత్రం కొత్తదనం లేదు. కామెడీని నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేశాడు. ఇలియానా బాగానే ఉంది కాని గ్లామరస్ గా చూపించే ప్రయత్నంలో చేసిన ఓవర్ మేకప్ బెడిసికొట్టింది. లావయ్యింది కూడా.

ఆదిత్య మీనన్ తో సహా విలన్ బ్యాచ్ మొత్తం ఎన్నో సినిమాల్లో చూసిన బాపతే. అభిమన్యు సింగ్ ఎఫ్బీ ఆఫీసర్ గా బాగా ఓవర్ చేసాడు. కామెడీ బ్యాచ్ చాలా పెద్దది సెట్ చేసాడు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రఘుబాబు, సునీల్, గుండు సుదర్శనం, జయప్రకాష్ రెడ్డి ఇలా గ్యాంగ్ చాలానే ఉంది కాని ఎవరినీ సరిగ్గా వాడుకోలేకపోయారు.

స్టార్ హీరోలతో మూడు డిజాస్టర్లు చవిచూశాక రవితేజ అవకాశం ఇచ్చినప్పుడు దర్శకుడు శీను వైట్ల దీనినొక ఛాలెంజ్ గా తీసుకోవాలి. కానీ అదేమి జరగలేదు. రివెంజ్ ఫార్ములా మీద రొటీన్ బ్యాక్ డ్రాప్ తో అర్థం లేని కామెడీని ఇరికించి ఖంగాలీ చేసి పారేశాడు. దేనికీ సరైన లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సన్నివేశాలను రాసుకుని ఏదో రెండున్నర గంటలు లాగించాలనే ప్రయాస తప్ప ఇందులో ఇంకేమి లేదు.

వాటా అంటూ అమెరికన్ ఎన్ఆర్ఐల సంఘాల గురించి, డ్రగ్స్ కేసులో సిట్ ఇన్వెస్టిగేషన్ ని పేరడీ చేయటం అన్నీ తేడా కొట్టేసాయి. ఏదీ కనీస స్థాయిలో లేవు. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ దారుణమైన ఫైనల్ ఔట్ ఫుట్ ని కాపాడలేకపోయాయి. ముతక హాస్యంతో యాక్షన్ ని కామెడీని బాలన్స్ చేయటం చేతకాక చెత్త స్క్రిప్ట్ తో ప్రేక్షకుల సహనంతో ఆడుకున్నాడు శీను వైట్ల. దీని తర్వాత కూడా ఏ హీరో అయినా ఇంకో అవకాశం ఇస్తే గొప్పే అనుకోవచ్చు.

తమన్ బిజిఎం ఒకే. ఒక్క మెలోడీ తప్ప మిగిలినవన్నీ బయటికెళ్లే బ్యాచ్ లోకే వస్తాయి. వెంకట్ సి దిలీప్ కెమెరా వర్క్ బాగుంది. యుఎస్ బ్యాక్ డ్రాప్ ని చక్కగా ప్రెజెంట్ చేసాడు. ఇక మిగిలిన విభాగాల గురించి చెప్పేందుకు ఏమీ మిగల్లేదు. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం దర్శకుడిని నమ్మేసి భారీగానే ఖర్చు పెట్టింది.

చివరిగా చెప్పాలంటే సినిమా ఎలా తీయకూడదు అని చెప్పడానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన దర్శకుడు సైతం, ఎంత తీసికట్టుగా ఆలోచించగలడు అని ఋజువు చేయడానికి తప్ప అమర్ అక్బర్ ఆంటోనీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. డిజార్డర్ అనే జబ్బు మెదడుకు సోకితే తప్ప ఇలాంటి ఆలోచనలతో సినిమాలు రావు. తాము రాసుకున్నదే కామెడీ, చూపించిందే ట్రీట్మెంట్ అనే భ్రమల్లో నుంచి సీనియర్ దర్శకులు బయటికి రాకపోతే పాతిక సినిమాలు పూర్తి కాకుండానే కెరీర్లు క్లైమాక్స్ కు వచ్చేస్తాయి.

యువ దర్శకులు స్మృజనాత్మకతతో కదం తొక్కుతుంటే ఇలాంటి అమర్ అక్బర్ ఆంటోనీలు మాత్రం టాలీవుడ్ గమనాన్ని వెనక్కు లాక్కెళుతున్నాయి. ఇకనైనా జాగ్రత్ వహించడం బెటర్.

First Published:  16 Nov 2018 10:06 AM IST
Next Story