Telugu Global
NEWS

ఇది పరాకాష్ట... సీబీఐ ఎంట్రీపై చంద్రబాబు నిషేధం

చంద్రబాబు చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అంశానికీ సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు సీబీఐ అంటే చాలు ఎందుకో వణుకుతున్నారు. ఏపీలో బహిరంగంగానే వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగినా ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు హడలిపోతున్నారు. ఐటీ దాడులకు వచ్చే అధికారులకు పోలీసు భద్రత కల్పించబోమని గతంలోనే ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు పరాకాష్ట అన్నట్టు, టీడీపీ ప్రభుత్వం […]

ఇది పరాకాష్ట... సీబీఐ ఎంట్రీపై చంద్రబాబు నిషేధం
X

చంద్రబాబు చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అంశానికీ సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు సీబీఐ అంటే చాలు ఎందుకో వణుకుతున్నారు. ఏపీలో బహిరంగంగానే వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

అదే సమయంలో రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగినా ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు హడలిపోతున్నారు. ఐటీ దాడులకు వచ్చే అధికారులకు పోలీసు భద్రత కల్పించబోమని గతంలోనే ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడు పరాకాష్ట అన్నట్టు, టీడీపీ ప్రభుత్వం భారత దేశ చట్టాలకు అతీతం అన్నట్టుగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు.

ఇప్పుడు ఏకంగా సీబీఐ ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటరవడంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను పరిశోధన చేయడానికి సీబీఐ అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది.

రాష్ట్రంలో దాడులు, దర్యాప్తులు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ ద్వారా పని చేస్తున్న సీబీఐ… ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో పని చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి ఉండాలి.

సీబీఐ లాంటి సంస్థలతో దర్యాప్తు చేయించాల్సిన వ్యవహారాలు చాలా ఉంటాయి కాబట్టి అన్ని రాష్ట్రాలూ సీబీఐకి అనుమతులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎప్పటి నుంచో సీబీఐని ఆహ్వానిస్తోంది. అయితే చంద్రబాబు, టీడీపీ నేతలు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీబీఐ విచారణకు అవకాశం ఉంటుందన్న భయంతోనే చంద్రబాబు ఇప్పుడు సీబీఐతో ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసినట్టు భావిస్తున్నారు.

ఒకవేళ సీబీఐ రాష్ట్రంలోకి ఎంటరవ్వాలంటే తొలుత చంద్రబాబు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పింది. సీబీఐ అవినీతితో కూరుకుపోయి, కేంద్రం చేతిలో ప్రత్యర్థులను వేధించే అస్త్రంగా మారిందని అందుకే ఏపీలోకి సీబీఐ రాకను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

సీబీఐ రాకను నిషేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసాధారణ, అసహజమైన, భారత దేశంలో తాము ప్రత్యేకం అని చాటుకునే చర్యగా ఉందని భావిస్తున్నారు.

First Published:  16 Nov 2018 1:59 AM IST
Next Story