Telugu Global
National

మనకు క్యాలెండర్ లో కొన్నే పండగలు.... వీళ్లు తల్చుకుంటే ప్రతీ వారం పండగే...!

మా వస్తువు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. ఇక్కడైతే 50 శాతం డిస్కౌంట్.. మా దగ్గర లక్కీ డ్రా గెలిస్తే ఫారిన్ ట్రిప్. ఇలా ప్రతీ రోజు టీవీ, పేపర్లు, ఎఫ్ఎం రేడియోలలో యాడ్స్ ఊదర గొడుతుంటారు. మా యాప్‌లో ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్  అంటారు. అసలు ఈ మతలబు అంతా ఎక్కడుంది ? బిజినెస్ చేసే ఎవరైనా తమ వస్తువును లాభాలతోనే అమ్ముకోవాలని అనుకుంటాడు కానీ.. ఉచితంగా ఇవ్వరు. కాని ఈ […]

మనకు క్యాలెండర్ లో కొన్నే పండగలు.... వీళ్లు తల్చుకుంటే ప్రతీ వారం పండగే...!
X

మా వస్తువు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ.. ఇక్కడైతే 50 శాతం డిస్కౌంట్.. మా దగ్గర లక్కీ డ్రా గెలిస్తే ఫారిన్ ట్రిప్. ఇలా ప్రతీ రోజు టీవీ, పేపర్లు, ఎఫ్ఎం రేడియోలలో యాడ్స్ ఊదర గొడుతుంటారు. మా యాప్‌లో ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ అంటారు. అసలు ఈ మతలబు అంతా ఎక్కడుంది ?

బిజినెస్ చేసే ఎవరైనా తమ వస్తువును లాభాలతోనే అమ్ముకోవాలని అనుకుంటాడు కానీ.. ఉచితంగా ఇవ్వరు. కాని ఈ రోజు ఏ పత్రిక, టీవీ చూసినా డిస్కౌంట్ ఆఫర్లే. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్ మార్కెట్లో ఈ ఆఫర్ల ధోరణి మరీ పెరిగిపోయింది. ఈ కామర్స్ మార్కెట్లో దిగ్గజ సంస్థలు వీటికి మరింత ఊతం ఇస్తున్నాయి.

గతంలో సాధారణంగా పండుగల సీజన్లో ఆఫర్లంటూ ఉండేవి. కాని ఇప్పుడు ఆఫర్ల కోసమే పండుగలు సృష్టిస్తున్నారు. గ్రేట్ ఇండియా.. ధమాకా సేల్.. అంటూ సామాన్య, మధ్యతరగతి ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు.

మనం బయట ఏ షాపులో కొనాలన్నా డబ్బులు చెల్లించాలి.. కాని ఈ-కామర్స్ సైట్లలో డబ్బులు లేకపోయినా ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేరిట ఆఫర్లు ఇస్తుండటంతో మధ్యతరగతి వినియోగదారులు ఎగబడి మరీ అనవసరపు ఖర్చులు పెడుతున్నారు. దీంతో అసలైన పండుగలు మర్చిపోయి.. ఈ అమ్మకపు దారుల పండుగల కోసం ఎదురుచూస్తున్నారు.

వినియోగదారులకు డిస్కౌంట్లు, ఆఫర్లు ఎరవేసి ముందు తమ సైట్లు, యాప్స్‌లోకి రప్పించుకుంటారని.. తర్వాత అలవాటు చేసి ఎడిక్ట్ చేస్తారని.. అదే వారి విజయ రహస్యమని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. అందుకే అవసరమైన సమయంలో మాత్రమే కొనుగోళ్లు చేసి.. అనవసరపు పండగలకు దూరం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  15 Nov 2018 1:36 AM IST
Next Story