Telugu Global
NEWS

భారత దేశవాళీ క్రికెట్లో ఇక మహిళా అంపైర్లు

తొలిసారిగా ఇద్దరు మహిళా అంపైర్లతో సీకెనాయుడు మ్యాచ్ బృందా రాఠీ- జననీలకు అరుదైన అవకాశం అడుగడుగునా పురుషుల ఆధిపత్యమే కనిపించే భారత దేశవాళీ క్రికెట్లో…..ఇద్దరు మహిళలు తొలిసారిగా…సీకె నాయుడు ట్రోఫీలోని ఓ మ్యాచ్ లో అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణమండలి ఓ అసాధారణ నిర్ణయిం తీసుకొంది. పశ్చిమ బెంగాల్ లోని కల్యాణి వేదికగా త్వరలో జరుగనున్న అండర్ -23 బాలుర సీకె నాయుడు టోర్నీలో భాగంగా మిజోరం-మణిపూర్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ […]

భారత దేశవాళీ క్రికెట్లో ఇక మహిళా అంపైర్లు
X
  • తొలిసారిగా ఇద్దరు మహిళా అంపైర్లతో సీకెనాయుడు మ్యాచ్
  • బృందా రాఠీ- జననీలకు అరుదైన అవకాశం

అడుగడుగునా పురుషుల ఆధిపత్యమే కనిపించే భారత దేశవాళీ క్రికెట్లో…..ఇద్దరు మహిళలు తొలిసారిగా…సీకె నాయుడు ట్రోఫీలోని ఓ మ్యాచ్ లో అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణమండలి ఓ అసాధారణ నిర్ణయిం తీసుకొంది.

పశ్చిమ బెంగాల్ లోని కల్యాణి వేదికగా త్వరలో జరుగనున్న అండర్ -23 బాలుర సీకె నాయుడు టోర్నీలో భాగంగా మిజోరం-మణిపూర్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు… అంపైర్లుగా తమిళనాడుకు చెందిన జనని, ముంబై అంపైర్ వృంధా రాఠీలను ఎంపిక చేసింది.

బీసీసీఐ అంపైర్ల కమిటీ ఇటీవలే నిర్వహించిన గ్రేడ్-2 అంపైర్ల పరీక్షలో జననీ, రాఠీ మాత్రమే ఉత్తీర్ణత సాధించడం విశేషం. క్రికెట్ స్కోరింగ్ లోనూ, ఫిట్ నెస్ ట్రైనర్లుగానూ వీరికి అనుభవం ఉంది.

మహిళలకు తగిన అవకాశాలు కల్పించాలని తాము నిర్ణయించినా..అంపైర్లుగా మహిళలు అర్హత సాధించలేకపోతున్నారని బీసీసీఐ వాపోతోంది.

మ్యాచ్ రిఫరీలుగా తగిన అవకాశాలు కల్పించడంలో భాగంగా 13 మంది మహిళలను ఎంపిక చేసినట్లుగా కూడా బీసీసీఐ ప్రకటించింది.

త్వరలో జరిగే జూనియర్ క్రికెట్, మహిళా క్రికెట్ మ్యాచ్ లకు.. మహిళలనే మ్యాచ్ రిఫరీలుగా నియమించనున్నారు.

క్రికెట్ అంపైర్లలో A, B, C, D అన్న నాలుగు స్థాయిలు కలిగిన వారు ఉంటారు. బృందా రాఠీ, జననీ.. నాలుగో గ్రేడ్ అంపైర్లుగా అర్హత సంపాదించారు.

First Published:  14 Nov 2018 4:50 AM IST
Next Story