Telugu Global
International

కశ్మీర్ మాకు వద్దు.... పాకిస్తాన్ స్టార్ క్రికెటర్!

ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా పాలించుకోలేకపోతున్నాం.. ఇక మనకు అదనంగా కశ్మీర్ ఎందుకు..? అంటూ తన దేశీయులను ప్రశ్నించాడు పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. లండన్ లో అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. పాకిస్తాన్ లో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా పాకిస్తాన్ ఒకనాటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో. ఇలాంటి నేపథ్యంలో దేశంలో పరిస్థితుల పట్ల అఫ్రిదీ పెదవి విరవడం ఆసక్తిదాయకంగా మారింది. పాకిస్తాన్ లో […]

కశ్మీర్ మాకు వద్దు.... పాకిస్తాన్ స్టార్ క్రికెటర్!
X

ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా పాలించుకోలేకపోతున్నాం.. ఇక మనకు అదనంగా కశ్మీర్ ఎందుకు..? అంటూ తన దేశీయులను ప్రశ్నించాడు పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ. లండన్ లో అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. పాకిస్తాన్ లో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా పాకిస్తాన్ ఒకనాటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో.

ఇలాంటి నేపథ్యంలో దేశంలో పరిస్థితుల పట్ల అఫ్రిదీ పెదవి విరవడం ఆసక్తిదాయకంగా మారింది. పాకిస్తాన్ లో నాలుగు ప్రావిన్స్ లున్నాయి. ఈ విషయాన్ని అఫ్రిదీ ప్రస్తావిస్తూ.. పాక్ లో ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే తమ పాలకులు సరిగా పాలించలేకపోతున్నారని…. అలాంటి వాళ్లకు మళ్లీ కశ్మీర్ ఎందుకు అని అప్రిదీ ప్రశ్నించాడు.

మరి ఇంత వరకూ ఓకే కానీ.. అలాగని కశ్మీర్ భారత్ కు కూడా చెందకూడదని అన్నాడు అఫ్రిదీ. కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. అటు ఇండియాకూ దక్కకుండా, పాక్ కూ సంబంధం లేకుండా కశ్మీర్ ప్రత్యేక దేశంగా ఉండాలని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు.

కశ్మీర్‌ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, కశ్మీర్ విషయంలో ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదని…. మానవత్వంతో వ్యవహరించాలని అఫ్రిదీ చెప్పాడు.

First Published:  14 Nov 2018 12:30 PM IST
Next Story