గ్రంథాలయాలు దేవాలయాలే!
పిన్నమ నేని రాజారావు కె.టి.ఆర్.లో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం గ్రంథాలయాలు దేవాలయాలే అని కె.టి.ఆర్. మహిళా కళాశాల సెక్రెటరీ పిన్నమనేని రాజారావు పేర్కొన్నారు. మనిషిని ఉన్నతులుగా తీర్చిదిద్ది, సంస్కారవంతులుగా చేసే శక్తి ఒక్క గ్రంథాలయాలకే ఉందని, వాటిని ఎంతో పవిత్రంగా చూడాలని ఆయన అన్నారు. 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కె.టి.ఆర్. మహిళా కాలేజీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా కాలేజీలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సుజాత అధ్యక్షత వహించారు. మఖ్యఅతిధిగా హాజరయిన పిన్నమనేని రాజారావు […]
- పిన్నమ నేని రాజారావు
- కె.టి.ఆర్.లో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
గ్రంథాలయాలు దేవాలయాలే అని కె.టి.ఆర్. మహిళా కళాశాల సెక్రెటరీ పిన్నమనేని రాజారావు పేర్కొన్నారు. మనిషిని ఉన్నతులుగా తీర్చిదిద్ది, సంస్కారవంతులుగా చేసే శక్తి ఒక్క గ్రంథాలయాలకే ఉందని, వాటిని ఎంతో పవిత్రంగా చూడాలని ఆయన అన్నారు.
51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కె.టి.ఆర్. మహిళా కాలేజీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా కాలేజీలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ సుజాత అధ్యక్షత వహించారు.
మఖ్యఅతిధిగా హాజరయిన పిన్నమనేని రాజారావు మాట్లాడుతూ కె.టి.ఆర్. కాలేజీకి ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడ చదివిన ఎంతో మంది ఉన్నత స్థితిలో స్థిరపడ్డారని, వారికి కాలేజీలో ఉన్న గ్రంథాలయం ఎంతో ఉపకరించిందని అన్నారు.
ఇంటర్నెట్ యుగంలోనూ గ్రంథాలయాలకు ఆదరణ తగ్గలేదని, పుస్తకాలు ముద్రణ, కొనుగొలు, చదవే వారూ పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదన్నారు. ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులకంటే ఎక్కువ బలాన్ని ఇస్తుందని, జీవితంలో ఉన్నత స్థితికి వచ్చిన వారంతా రోజుల తరబడి గ్రంథాలయాల్లో పుస్తకాల మధ్య గడిపిన వారే అని గుర్తు చేశారు.
కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ కాలేజీలో ఉన్న గ్రంథాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. కేవలం పాఠ్యగ్రంథాలే కాకుండా వ్యక్తిత్వవికాసం, ప్రముఖుల జీవితచరిత్రలు కూడా అందుబాటులో ఉంచామన్నారు.
గ్రంథాలయాధికారి కె. కుసుమకుమారి మాట్లాడుతూ కాలేజీలో విద్యార్థులకు అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచమాన్నారు. వారం రోజులపాటు గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతామని, వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కాలేజీ మాజీ ప్రిన్సిపాళ్లు నిర్మల,జయలక్ష్మి,కమిటీ సభ్యులు రామరాఘవరెడ్డి,నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. కళ్యాణి స్వాగతం పలకగా, సత్యవాణి వందన సమర్పణ చేశారు.