Telugu Global
Family

జాంబవంతుడు

పురాణ ఇతిహాసాల్లో మర్కటాన్ని పోలిన ఆంజనేయుడు, నందిగా దర్శనమిచ్చిన నందీశ్వరుడు, పక్షి జాతికి చెందిన గరుత్మంతుడు, సర్పజాతికి చెందిన నాగరాజు ఇలా చాలా మందిని చూస్తుంటాం కదా?, అలాగే భల్లూక జాతికి చెందిన జాంబవంతుడు యతి వృద్ధుడుగా మనకు దర్శనమిస్తాడు. ఎలుగు బంటిని పోలిన మనిషిని చూస్తే మహాశ్చర్యం కలుగుతుందేం?!, మరందునే జాంబవంతుడి గురించి తెలుసుకుందాం! బ్రహ్మదేవుడు ఆవులించగా జాంబవంతుడు పుట్టాడని చెపుతారు.

Jambavanta
X

జాంబవంతుడు

పురాణ ఇతిహాసాల్లో మర్కటాన్ని పోలిన ఆంజనేయుడు, నందిగా దర్శనమిచ్చిన నందీశ్వరుడు, పక్షి జాతికి చెందిన గరుత్మంతుడు, సర్పజాతికి చెందిన నాగరాజు ఇలా చాలా మందిని చూస్తుంటాం కదా?, అలాగే భల్లూక జాతికి చెందిన జాంబవంతుడు యతి వృద్ధుడుగా మనకు దర్శనమిస్తాడు. ఎలుగు బంటిని పోలిన మనిషిని చూస్తే మహాశ్చర్యం కలుగుతుందేం?!, మరందునే జాంబవంతుడి గురించి తెలుసుకుందాం!

బ్రహ్మదేవుడు ఆవులించగా జాంబవంతుడు పుట్టాడని చెపుతారు. గరుత్మంతుడు పుట్టడానికన్నా ముందే జాంబవంతుడు పుట్టి భల్లూక రాజయ్యాడు. దేవతలు అమృతం తేవడం, దేవతలూ రాక్షసులూ యుద్ధం చేయడం చూసినవాడు. అంతేకాదు భూమి ఆకాశాలను అనేకసార్లు ప్రదక్షిన చేసినవాడు. బలి యజ్ఞము చేసేటప్పుడు ఔషదులు ఇతని చేతికేయిచ్చారు. ఈ జాంబవంతుడు దేవతల నడిగి అమృతం తాగాడు. అందుకే జాంబవంతుని చిరంజీవిగా చెపుతారు.

జాంబవంతుడు యుక్త వయస్సులోనే ఉదయాద్రి ఉంచి వస్తాద్రి దాటి కైలాసం వరకూ వస్తూవుండే వాడట. మునులంతా కైలాసములో తపస్సు చేస్తూ వుంటే జాంబవంతుడు వాళ్ళతో మాట్లాడి వచ్చేవాడట. అలాంటి సందర్భంలో బలికుమారుడు పర్వతాన్ని ఎత్తి జాంబవంతుడిపైకి విసిరితే దాన్ని ఆపడానికి జాంబవంతుడు మోకాలు అడ్డుపెట్టాడట. అప్పుడతని కాలుకి తగిలి పర్వతం రెండు ముక్కలయిపోయిందట. ఇతని కాలుకి దెబ్బ తగిలింది. దాంతో వంట్లో వుండే శక్తి కొంత తగ్గిందట.

సీతమ్మను చూసి రావడానికి సముద్రం దాటడానికి ఎవరున్నారంటే హనుమంతుడున్నాడని చెప్పి, అతని ధైర్యసాహసాలు చెప్పి గుర్తుచేసినవాడు జాంబవంతుడే!

పురాణాల్లో అవతార పురుషులు సహితం ఏయుగంలో వారు ఆయుగంలో అవతరించి అంతరిస్తారు. కాని కృత త్రేతాయుగములలోనే కాక ద్వాపరయుగం వరకూ జాంబంవంతుడు వున్నాడు. ఇతనికి జాంబవతి అనే కూతురు కూడా వుంది. ప్రసేన జిత్తును చంపి సింహము శమంతక మణిని తేవడం చూసి, ఆ సింహాన్ని చంపి ఆమణిని తెచ్చి కూతురుండే ఊయలకు కట్టాడు.

ఆ మణి కోసం కృష్ణుడు వస్తే తెలియక కృష్ణునితో సహితం యుద్ధం చేసాడు. తెలిసాక తన కుమార్తెను శ్రీకృష్ణునికిచ్చి పెళ్ళి చేసాడు.

జాంబవంతుడు చాలా ప్రజ్ఞావంతుడూ, బలవంతుడే కాక చిరంజీవి. పిల్లలకూ పెద్దలకూ ఆసక్తి గొలిపే రూపంతో కథనంతో ఇతని పాత్ర అజరామరమయినది.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  9 Aug 2022 2:30 PM IST
Next Story